కేవలం 10 నిముషాల్లో పాన్ కార్డు పొందవచ్చు…ఎలాగంటే..!

HIGHLIGHTS

కొత్త సదుపాయంతో కేవలం 10 నిముషాల్లో పాన్ కార్డు పొందవచ్చు

మీరు పడిగాపులు కాయాల్సిన అవసరం కూడా లేదు

మీ ఆధార్ కార్డ్ కలిగి ఉంటే సరిపోతుంది

కేవలం 10 నిముషాల్లో పాన్ కార్డు పొందవచ్చు…ఎలాగంటే..!

మీరు ఇప్పటి వరకూ పాన్ కార్డ్ పొందనట్లయితే, ప్రభుత్వం అందించిన కొత్త సదుపాయంతో కేవలం 10 నిముషాల్లో పాన్ కార్డు పొందవచ్చు.  మీరు ఇప్పటి వరకూ అప్లై చేయనట్లయితే చాలా సులభంగా ఆన్లైన్లో చేసుకోవచ్చు. అంతేకాదు, దీనికోసం మీరు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం కూడా లేదు. అంతేకాదు, ఈ పాన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకోవడమేకాకుండా ePAN ను డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండియా అందించిన కొత్త సదుపాయంతో కేవలం 10 నిముషాల్లో పాన్ కార్డు పొందవచ్చు. దీనికోసం మీరు మీ ఆధార్ కార్డ్ కలిగి ఉంటే సరిపోతుంది.

ఇప్పుడు కేవలం పదే పది నిమిషాల్లో మీ ఇంట్లో కూర్చొనే ఖర్చు లేకుండా కొత్త పాన్ కార్డును పొందవచ్చు. ప్రభుత్వం అందించిన సౌకర్యాలతో మీరు మీ పాన్ కార్డు ను ఆన్లైన్లో కేవలం 10 నిమిషాల్లో క్రియేట్ చెయ్యవచ్చు. మరి అది ఎలా చేయ్యాలో తెలుసుకుందామా..!

ఆన్‌లైన్‌లో పాన్ కార్డు కోసం ఎలా అప్లై చెయ్యాలో క్రింద చూడవచ్చు ….

1. ముందుగా https://www.incometaxindiaefiling.gov.in/ వెబ్సైట్ కి వెళ్లాలి.

2. ఇక్కడ మీరు ఎడమ వైపున కనిపించే "Instant PAN through Aadhaar" పై క్లిక్ చేయాలి.

3. ఇప్పుడు మీరు కొత్త పేజీకి మళ్ళించబడతారు

4. ఈ పేజీలో మీరు "Get New PAN" అప్షన్ పైన నొక్కాలి.

5. ఇక్కడ మీరు అప్లికేషన్ చూడవచ్చు

6. ఇక్కడ బాక్సులో మీ ఆధార్ నంబర్ నమోదు చేయాలి మరియు OTP కోసం కాప్చా కోడ్ ఎంటర్ చెయ్యాలి.

7. ఆధార్ కార్డుతో అనుబంధించబడిన రిజిష్టర్ మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది.

8. ఇప్పుడు మీ రిజిష్టర్ నంబర్ కు వచ్చిన OTP ని ఎంటర్ చెయ్యాలి.

9. OTP ఇచ్చిన తరువాత, మీరు పాన్ కార్డ్ అప్లికేషన్ కోసం ఇ-మెయిల్ ఐడిని ధృవీకరించాలి.

ఈ విధంగా ఈ ఫారమ్‌ ను పూర్తి చేసిన తర్వాత, కేవలం 10 నిమిషాల్లో మీ పాన్ నంబర్‌ ను పొందుతారు మరియు దీనిని మీరు కావాలనుకుంటే PDF ఫార్మాట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం, మీరు "చెక్ స్టేటస్ / డౌన్‌లోడ్ పాన్" ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా ఈ వెబ్‌సైట్ నుండి PDF ఫైల్‌ లో పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ, మీకు హార్డ్ కాపీ కావాలంటే, దాని కోసం మీరు 50 రూపాయలు చెల్లించాలి.

అలాగే, PAN వెరిఫికేషన్ కూడా చాలా సులభతరం చేసింది. దీనికోసం https://www.incometax.gov.in/iec/foportal/ పేజీకి వెళ్ళాలి. తరువాత, హోమ్‌పేజీలో ‘Verify Your PAN’ లింక్ కోసం సెర్చ్ చేయండి. ఎంపికపై క్లిక్ చేసి, మీ పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మరియు పేరు వంటి మీ పాన్ కార్డ్ వివరాలను నమోదు చేయండి. మీరు వివరాలను ధృవీకరించిన తర్వాత, మీరు PAN యొక్క PDF కాపీని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo