Hero Vida V1: ఇండియాలో విడుదలైన హీరో మోటో కొత్త ఎలట్రిక్ స్కూటర్..!

HIGHLIGHTS

Hero Moto ఇండియాలో తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లను విడుదల చేసింది

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు 80 Kmph టాప్ స్పీడ్ తో ప్రయాణించగలవు

Hero Vida V1 రెండు వేరియంట్ లలో అందించబడుతుంది

Hero Vida V1: ఇండియాలో విడుదలైన హీరో మోటో కొత్త ఎలట్రిక్ స్కూటర్..!

Hero Moto ఇండియాలో తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లను విడుదల చేసింది. ఈ స్కూటర్లు 80 Kmph టాప్ స్పీడ్ తో ప్రయాణించగల శక్తిని కలిగివున్నట్లు కంపెనీ తెలిపింది. హీరో ఈ Vida V1 లో రెండు వేరియంట్ లను మార్కెట్లో ఆవిష్కరించింది. ఇందులో Vida V1 Pro మరియు Vida V1 Plus రెండు వేరియంట్ లు వున్నాయి. ఇండియాలో హీరో మోటో సరికొత్తగా విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలాంటి ఫీచర్లను కలిగి ఉన్నాయో మరియు వాటి ధర వివరాలను తెలుసుకుందాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Hero Vida V1: ప్రత్యేకతలు

పైన తెలిపిన విదంగా, Hero Vida V1 రెండు వేరియంట్ లలో అందించబడుతుంది. అవి, విడా వి1 ప్రో మరియు విడా వి1 ప్లస్ వున్నాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా గరిష్టంగా 80 Kmph టాప్ స్పీడ్ తో ప్రయానించే శక్తితో వస్తాయి. అంతేకాదు, ఈ రెండు వేరియంట్ లు కూడా మార్చుకోగల(swappable)  బ్యాటరీలతో కూడా వస్తాయి. ఇక ప్రయాణ సామర్ధ్యం విషయానికి వస్తే, Vida V1 Pro పూర్తి ఛార్జింగ్ తో 165 కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలిగితే, Vida V1 Plus  మాత్రం పూర్తి ఛార్జింగ్ తో 143 కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది.

ఈ రెండు స్కూటర్లలో కూడా 7 ఇంచ్ HD టచ్ డిస్ప్లేతో పాటుగా రెజ్యూమ్ ఫంక్షన్‌తో క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ తో V1 Pro కేవలం 2 గంటల 17 నిమిషాల లోపు 0 నుండి 100% వరకు ఛార్జ్ చేయగలదని మరియు V1 Plus 2 గంటలలోపు 0 నుండి 100% వరకు ఛార్జ్ చేయగలదని హీరో పేర్కొంది.

Hero Vida V1: ధర

విడా వి1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్ రూ.1,45,000 నుండి ప్రారంభమవుతుంది. అయితే, హై ఎండ్ వేరియంట్ Vida V1 Pro ధర మాత్రం రూ.1,59,000 నుండి ప్రారంభమవుతుంది. ఈ Vida ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ అక్టోబర్ 10 నుండి ప్రారంభమవుతాయి. అయితే, డెలివరీ మాత్రం డిసెంబర్ 2022లో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo