ఈ సమ్మర్ కోసం Air Cooler కొనేముందుగా ఈ విషయాలు గుర్తుంచుకోండి …!
రూమ్ కూలర్ ఎంచుకోవటానికి బెస్ట్ టిప్స్
తక్కువ ధరలోనే మీ ఇంటికి తగిన ఒక మంచి ఎయిర్ కూలర్ ఎంచుకోవచ్చు
వేసవి కోసం ఒక మంచి కూలర్ ఎంచుకోవడం మంచిది
తెలుగు రాష్ట్రలో చల్ల గాలులు వీస్తున్నా ఎండ తీవ్రత మాత్రం నానాటికి పెరుగుతోంది. అందుకే, రానున్న వేసవి కోసం ఒక మంచి కూలర్ ఎంచుకోవడం మంచిది. ప్రస్తుతం ఒక మంచి బ్రాండెడ్ రూమ్ కూలర్ కొనాలంటే కనీసం పదివేల రూపాయలైనా ఖర్చు చేయాల్సిందే. అందుకే, డబ్భును ఖర్చుచేసే ముందుగా మనకు తగిన మరియు సరైన ప్రోడక్ట్ నే తీసుకుంటున్నామా? లేదా అని చూసుకోవాలి. దీనికోసమే, ఈ 3 విషయాలను గుర్తుంచుకుంటే తక్కువ ధరలోనే మీ ఇంటికి తగిన ఒక మంచి ఎయిర్ కూలర్ ఎంచుకోవచ్చు.
SurveyRoom Size
మనం ఎటువంటి కూలర్ ని కొనాలనుకుంటున్నామో ముందుగా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే, కేవలం ఒక్కరు ఇద్దరి కోసం అయితే పర్సనల్ కూలర్ సరిపోతుంది. కానీ, మీ రూమ్ మొత్తం చల్లని గాలితో నింపాలంటే మాత్రం డెజర్ట్ కూలర్ ని తీసుకోవాల్సి వుంటుంది.
Tank Capasity
ఒక ఎయిర్ కూలర్ తీసుకునేప్పుడు అతిముఖ్యంగా చూడాల్సిన విషయం వాటర్ ట్యాంక్ కెపాసిటీ. ఎయిర్ కూలర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఎక్కువగా ఉంటుందో, కూలర్ కూడా అంత ఎక్కవ కూలింగ్ కెపాసిటీని కలిగి వుంటుంది. ఒక చిన్న రూమ్ కోసం 15 లీటర్ల కెపాసిటీ, మీడియం సైజు రూమ్ కోసం 25 లీటర్ల కెపాసిటీ మరియు పెద్ద రూమ్ కోసం కనీసం 40 లీటర్ల కెపాసిటీ గల కూలర్ ను ఎంచుకోవాలి.
Cooling Pads
ఇక మరొక ముఖ్యమైన విషయం కూలర్ ప్యాడ్స్. ఎందుకంటే, కూలర్ కూలింగ్ ని నిర్ణయించేది కూలింగ్ ప్యాడ్స్. మూడు రకాలైన ప్యాడ్స్ తో కూలర్లు వస్తాయి. 1. చెక్క గ్రాస్ కూలర్ ప్యాడ్స్ 2. ఆస్పెన్ చెట్టు గ్రాస్ ప్యాడ్స్ 3. హాని కోంబ్ ప్యాడ్స్. ఈ మూడు రకాల కూలింగ్ ప్యాడ్స్ లో కూడా హాని కోంబ్ ప్యాడ్స్ ఉత్తమంగా ఉంటాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile