కరోనా వైరస్ లాక్ డౌన్ : సమీప ఓపెన్ షాప్స్ వివరాలు తెలిపే వెబ్ సైట్ విడుదల

కరోనా వైరస్ లాక్ డౌన్ : సమీప ఓపెన్ షాప్స్ వివరాలు తెలిపే వెబ్ సైట్ విడుదల
HIGHLIGHTS

ఇది వినియోగదారులకు సమీపంలో తెరిచి ఉంచిన దుకాణాన్ని చూపిస్తుంది.

కరోనావైరస్ వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేయడానికి, భారతదేశం 21 రోజుల లాక్ డౌన్ లో కొనసాగుతోంది. ఈ లాక్ డౌన్, అన్ని దుకాణాలను మరియు మార్కెట్లను అందుబాటులో ఉంచుతోంది మరియు అనవసరమైన వాటిని మాత్రమే మూసివేయడానికి,   అమలు చేచేయబడుతోంది. సహజంగానే, కిరాణా, కూరగాయలు మరియు మరెన్నో రోజువారీ నిత్యావసరాల సేకరణలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అందుకే, ఈ బాధను తగ్గించడంలో సహాయపడటానికి, Quicker కొత్తగా Still Open అనే వెబ్‌ సైట్‌ను ప్రారంభించింది. ఇది వినియోగదారులకు వారి సమీపంలో తెరిచి ఉంచిన దుకాణాన్ని చూపిస్తుంది.

వెబ్‌సైట్‌ లింక్ కోసం ఇక్కడ నొక్కండి. http://stillopen.quikr.com/open-stores-near-me

అంతే కాదు, COVID-19 మరియు అవసరమైన వాటికి మినహాయింపుగా వర్గీకరించబడిన ఇతర దుకాణాల కోసం సమీప మెడికల్ స్టోర్ మరియు టెస్టింగ్ సెంటర్ ని కూడా Still Open వెబ్సైటు చూపిస్తుంది.

సైట్ క్రమం తప్పకుండా, అప్డేట్స్ కోసం క్రౌడ్-సోర్స్ డేటాపై ఆధారపడుతుంది. దుకాణాలను సందర్శించే వినియోగదారులకు  అందుబాటులో ఉన్న ఉత్పత్తులు, సమయాలు మరియు పరిశుభ్రత గురించిన వివరాలతో  సైట్‌ను అప్డేట్ చేస్తుంది. రివ్యూస్ , ఫోటోలు మరియు మరిన్ని అప్‌లోడ్ చేయడానికి కూడా ఎంపికలు ఉన్నాయి.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, ఈ సర్వీస్ భారతదేశంలోని 23 నగరాల్లో ఆంగ్లభాషలో అందుబాటులో ఉంది. మరో పది నగరాలకు విస్తరించాలని, త్వరలో 13 స్థానిక భాషలను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo