Mars పైకి NASA పంపిన క్యూరియాసిటీ లేటెస్ట్ ఫోటోలను పంపింది. ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మార్స్ పైన మేఘాలు ఏర్పడడాన్ని అద్భుతంగా చిత్రికరించిన క్యూరియాసిటీ రోవర్ వాటిని భూమికి పంపింది. వాస్తవానికి, మార్స్ గ్రాహం పైన వుండే వాతావరణం కారణంగా అక్కడ మేఘాలు ఏర్పడడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే, Mars పైన ఏర్పడిన మేఘాలను మరియు దాని వివరాలతో ఉన్న ఫోటోలను భూమికి పంపింది. ఈ ఫోటోలను నాసా అంతరిక్ష సంస్థ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
మార్స్ పైన వాతారణం తో పాటుగా మరిన్ని వివరాలను సేకరించేందుకు గాను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ NASA, మార్స్ పైకి పంపిన క్యూరియాసిటీ ఈ ఫోటో లను పంపించింది. క్యూరియాసిటీ పంపిన ఈ ఫోటోలలో మార్స్ పైన మేఘాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రింద ఫోటోలను చూడవచ్చు.
ఫోటో-1
ఫోటో-2
క్యూరియాసిటీ రోవర్ పంపిన ఈ లేటెస్ట్ ఫోటోలతో మార్స్ పైన మేఘాలు ఏర్పడతావని అర్ధమవుతోంది. అయితే, ఇవి ఎలా ఏర్పడ్డాయి, ఇంకా మార్స్ పైన ఎటువంటి వాతావరణ మార్పులు నెలకొంటాయి. అనేటటువంటి ఆసక్తికర కోణాలలో దృష్టిపెట్టే వీలుంటుంది. మార్స్ పైన ఇంకా ఏవైనా ఖనిజాలు మరియు లవణాలు ఉన్నాయనే వాటిని కూడా క్యూరియాసిటీ అన్వేసస్తోంది.