సెప్టెంబర్ 2021 నుండి ఇన్ యాప్ కొనుగోళ్లకు గూగుల్ ప్లే యొక్క బిల్లింగ్ సిస్టం తప్పనిసరి

సెప్టెంబర్ 2021 నుండి ఇన్ యాప్ కొనుగోళ్లకు గూగుల్ ప్లే యొక్క బిల్లింగ్ సిస్టం తప్పనిసరి
HIGHLIGHTS

ఇటీవలి Paytm వివాదం తరువాత Google కొత్త ప్రకటన

స్పోర్ట్స్ బెట్టింగ్ కార్యకలాపాలపై తన విధానాన్ని ఉల్లంఘించినందుకు సెప్టెంబర్ 18 న గూగుల్ ప్లే స్టోర్‌ లోని Paytm యాప్ ని బ్లాక్ చేసింది.

గూగుల్ ప్లే బిల్లింగ్ విధానం ఎప్పటినుండో ఉనికిలో ఉందని ఈ సెర్చ్ దిగ్గజం పేర్కొంది

ఇటీవలి Paytm వివాదం తరువాత, ప్లే స్టోర్ ద్వారా డిజిటల్ కంటెంట్‌ ను విక్రయించే అన్ని యాప్స్ కూడా గూగుల్ ప్లే యొక్క బిల్లింగ్ సిస్టమ్‌ను ఉపయోగించాల్సి ఉంటుందని, ఆ యాప్‌లో చేసిన ప్రతి కొనుగోలుకు గూగుల్ నిర్ణీత శాతం ఫీజు వసూలు చేస్తుందని గూగుల్ ప్రకటించింది. స్పోర్ట్స్ బెట్టింగ్ కార్యకలాపాలపై తన విధానాన్ని ఉల్లంఘించినందుకు సెప్టెంబర్ 18 న గూగుల్ ప్లే స్టోర్‌ లోని Paytm యాప్ ని బ్లాక్ చేసింది.

దీనికి సంబంధించి గూగుల్ యొక్క స్టేట్మెంట్ ఇలా ఉంది, “గూగుల్ ప్లే బిల్లింగ్ విధానం ఎల్లప్పుడూ ఇన్ యాప్ ద్వారా డిజిటల్ వస్తువుల కొనుగోలు కోసం గూగుల్ ప్లే యొక్క బిల్లింగ్ వ్యవస్థను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మేము మా చెల్లింపుల విధానంలోని భాషను మరింత స్పష్టంగా చెప్పాలంటే వారి యాప్స్ ద్వారా విక్రయించే డిజిటల్ గూడ్స్ డెవలపర్లు అందరూ కూడా Google Play యొక్క బిల్లింగ్ వ్యవస్థను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. మా విధానానికి ఇది ఎల్లప్పుడూ అవసరం. Google యాప్స్ అదే నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. ”

గూగుల్ ప్లే బిల్లింగ్ విధానం ఎప్పటినుండో ఉనికిలో ఉందని ఈ సెర్చ్ దిగ్గజం పేర్కొంది. ఈ ప్రకటన ద్వారా తన విధానాలపై స్పష్టంగా పునరుద్ఘాటించే స్పష్టీకరణ మాత్రమే. యాప్ డెవలపర్స్ తమ యాప్స్ ద్వారా చేసిన చెల్లింపుపై 30% రుసుము తీసుకునే Google యొక్క బిల్లింగ్ వ్యవస్థను ఉపయోగించడం తప్పనిసరి అని దీని అర్థం. ఇది సెప్టెంబర్ 2021 నుండి వర్తిస్తుంది. భద్రతా రాజీ లేకుండా తన పరికరాల్లో ఇతర యాప్ స్టోర్స్ ఉపయోగించడం సులభతరం చేయడానికి వచ్చే ఏడాది ఆండ్రాయిడ్ వెర్షన్ ‌ను సర్దుబాటు చేస్తామని కంపెనీ పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo