GOOGLE వినియోగదారుల ప్రైవసీ మరియు సెక్యూరిటీ కోసం కొత్త ఫీచర్లను తెచ్చింది

GOOGLE వినియోగదారుల ప్రైవసీ మరియు సెక్యూరిటీ కోసం కొత్త ఫీచర్లను తెచ్చింది
HIGHLIGHTS

గూగుల్ వినియోగదారుల కోసం కొన్ని కొత్త Privacy Controls ను కూడా తీసుకువస్తోంది.

మేలో జరిగిన Google I / O సందర్భంగా గూగుల్ మ్యాప్స్ మరియు ఆండ్రాయిడ్ యాప్స్ సెర్చ్ కి సంబంధించిన కొన్ని మార్పులను ప్రకటించగా, సంస్థ ఇప్పుడు వాటిని  అమలు చేయబోతోంది. ఆ సమయంలో ఈ ఆండ్రాయిడ్ యాప్స్ లో అంతర్నిర్మిత Incognito మోడ్‌ను పరిచయం చేయడం గురించి ముందుగా కంపెనీ వివరించింది. అయితే,  గూగుల్ ఇప్పుడు  దీన్ని అధికారికంగా విడుదల చేస్తోంది.

దాని సహాయంతో, మీరు ఇప్పుడు మీ సెర్చ్ కార్యాచరణను మెరుగైన మార్గంలో పర్యవేక్షించవచ్చు. అలాగే, మీరు Google అకౌంట్ సెర్చ్  డేటాను ఆపివేయవచ్చు. యాప్  క్రింద ఉన్న ప్రొఫైల్ మెనూకు వెళ్లడం ద్వారా మీరు దీన్ని యాక్సెస్ చేయవచ్చు. ఇది మాత్రమే కాదు, గూగుల్ వినియోగదారుల కోసం కొన్ని కొత్త Privacy Controls ను కూడా తీసుకువస్తోంది.

వీటిలో, మీరు YouTube కోసం ఆటో-డిలీట్ ఫీచర్‌ను పొందనున్నారు, దీని కింద వినియోగదారులు అన్ని place , History  మరియు యాప్ ఆక్టివిటీ డేటాను తొలగించవచ్చు. అదనంగా, దీని కోసం మీరు నిర్ణీత కాల వ్యవధిని కూడా సెట్ చేయవచ్చు. యూజర్లు 3 నుండి 18 నెలల వరకు యూట్యూబ్ యాప్ లో ఈ సెట్టింగ్‌ను చేయవచ్చు మరియు ఆ తర్వాత డేటా స్వయంచాలకంగా ( ఆటొమ్యాటిగ్గా) తొలగించబడుతుంది. ఈ ఫీచరును యాప్ లోని మై ఆక్టివిటీ మెను నుండి యాక్సెస్ చేయవచ్చు.

గూగుల్ అసిస్టెంట్ కొత్త Privacy Control ఫీచరును కూడా పొందునున్నారు. ఇది వినియోగదారులను వాయిస్ కమాండ్ డేటాను ఒక వారం వరకు తొలగించడానికి అనుమతిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo