Gemini 4 Neon కొత్త మోడల్ లాంచ్ చేసిన గూగుల్ .. మరింత వేగవంతమైన మోడల్ వచ్చేసింది.!
గూగుల్ నుంచి వచ్చే కొత్త అప్ డేట్స్ పై టెక్ ప్రపంచం ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంది
Gemini 4 Neon AI మోడల్ ఇప్పుడు టెక్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది
ఈ కొత్త మోడల్ లో 1 మిలియన్ టోకెన్ల కాంటెక్స్ట్ విండో అందించారు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో గూగుల్ నుంచి వచ్చే కొత్త అప్ డేట్స్ పై టెక్ ప్రపంచం ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంది. ముఖ్యంగా గూగుల్ జెమినీ సిరీస్ ద్వారా ఇప్పటికే ఎన్నో AI ఫీచర్లను అందించిన గూగుల్, ఇప్పుడు మరో కొత్త మోడల్ కూడా తీసుకొచ్చింది. ఈ కొత్త వార్త ఇప్పుడు టెక్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. గూగుల్ కొత్త ప్రకటించిన Gemini 4 Neon AI మోడల్ లో కీలకమైన కొత్త ఫీచర్స్ ఏమిటో తెలుసుకుందామా.
Gemini 4 Neon
గూగుల్ మరో కొత్త మోడల్ ని పరిచయం చేసింది. అదే గూగుల్ జెమినీ 4 నియాన్ మరియు ఇది కోడింగ్, డేటా విశ్లేషణ, సైంటిఫిక్ రీసెర్చ్ వంటి క్లిష్టమైన పనులు కూడా వేగంగా పూర్తి చేయడం దీని ప్రత్యేకత, అని గూగుల్ తెలిపింది. ముఖ్యంగా, ఈ మోడల్ ఎక్కువ సమయం తీసుకునే క్లిష్టమైన పనులను కూడా చాలా తక్కువ సమయంలో సత్తా కలిగి ఉంటుందని చెబుతున్నారు.
ఒకేసారి భారీ డేటాను విశ్లేషించే సామర్థ్యం
ఈ కొత్త మోడల్ లో 1 మిలియన్ టోకెన్ల కాంటెక్స్ట్ విండో అందించారు. దీనివల్ల భారీ PDF ఫైల్స్, స్ప్రెడ్ షీట్లు, చార్టులు, ఆడియో మరియు వీడియో వంటి విభిన్న సమాచారాన్ని ఒకేసారి విశ్లేషించవచ్చు. వీటి ఆధారంగా ఈ కొత్త గూగుల్ ఏఐ మోడల్ రిపోర్టులు, సారాంశాలు మరియు డేటా విశ్లేషణలను రూపొందించగలదు.
రీజనింగ్ అండ్ రీసెర్చ్ లో కొత్త సామర్థ్యాలు
కేవలం భారీ డేటా విశ్లేషణ మాత్రమే కాదు ఇది రీజనింగ్ అండ్ రీసెర్చ్‌లో కొత్త సామర్థ్యాలు కలిగి ఉంది. ఇది క్లిష్టమైన గణిత సమస్యలు, శాస్త్రీయ పరిశోధన, ఫైనాన్షియల్ డేటా విశ్లేషణ వంటి వాటిలో మెరుగైన ఫలితాలు అందించేలా దీన్ని రూపొందించారు. వినియోగదారులు పని మధ్యలో సూచనలు మార్చినా కూడా వాటికి అనుగుణంగా ఈ కొత్త మోడల్ స్పందించగలదు. అలాగే, నాలుగు థింకింగ్ లెవల్స్ ద్వారా పనిని బట్టి వేగం మరియు విశ్లేషణ స్థాయిని ఎంచుకోవచ్చు.
కోడింగ్ లో మరింత మెరుగైన పెర్ఫార్మెన్స్
సాఫ్ట్ వేర్ డెవలపర్ల కోసం ఈ మోడల్ లో ప్రత్యేక మరియు మెరుగైన సామర్థ్యాలను అందించారు. ఒక ప్రాజెక్ట్ లోని అనేక కోడ్ ఫైల్స్ ను పరిశీలించడం, బగ్స్ గుర్తించడం, వాటిని సరిచేయడం మరియు ఆ కోడ్ ను మెరుగుపరచడం వంటి పనులను అలవోకగా జెమినీ 4 నియాన్ చేయగలదు. Google Anti Gravity లో ఇతర AI ఏజెంట్ లతో కలిసి పనిచేసే సామర్థ్యం కూడా ఈ కొత్త మోడల్ కి ఉంది.
ధర
Gemini API ద్వారా ప్రతి మిలియన్ ఇన్ పుట్ టోకెన్లకు 3 డాలర్లు, అవుట్ పుట్ టోకెన్లకు 15 డాలర్ల ధరను నిర్ణయించారు. ఇది నిన్న లాంచ్ అయ్యింది మరియు గూగుల్ జెమిని AI Pro అండ్ Ultra ప్లాన్స్ తో అందుబాటులో ఉంది.