Google I/O 2026: ల్యాప్‌ టాప్ ఆఫ్‌ లో ఉన్నా పనిచేసే Gemini Spark ఫీచర్ అందించిన గూగుల్.!

HIGHLIGHTS

గూగుల్ I/O 2026 ఈ వెంట్‌ నుంచి “Gemini Spark” అనే కొత్త AI అసిస్టెంట్‌ ను పరిచయం చేసింది

ఈ ఫీచర్ గురించి ఒక అద్భుతం అని గూగుల్ నిర్వచించింది

బ్యాక్‌ గ్రౌండ్‌ లో పనిచేస్తూ మీ పనులను ఆటోమేటిక్‌ గా పూర్తి చేయగలదు

Google I/O 2026: గూగుల్ ఈరోజు నిర్వహించిన గూగుల్ I/O 2026 ఈ వెంట్‌ నుంచి “Gemini Spark” అనే కొత్త AI అసిస్టెంట్‌ ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ ఫీచర్ గురించి ఒక అద్భుతం అని గూగుల్ నిర్వచించింది. ఎందుకంటే, ఇది సాధారణ ఏఐ చాట్ బాట్ మాదిరిగా అడిగినప్పుడు మాత్రమే రెస్పాన్స్ ఇచ్చేలా కాకుండా, ఎల్లప్పుడు బ్యాక్‌ గ్రౌండ్‌ లో పనిచేస్తూ మీ పనులను ఆటోమేటిక్‌ గా పూర్తి చేయగలదు.

Google I/O 2026: Gemini Spark

గూగుల్ కొత్త ఇన్నోవేటివ్ ఫీచర్స్ తీసుకురావడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. అంతేకాదు, ఈ కొత్త ఫీచర్స్ యూ ఉచితంగా కోడోత్ అందిస్తుంది. ఇప్పుడు కూడా కొత్తగా జెమిని స్పార్క్ ఫీచర్ ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Gemini Spark ప్రత్యేకత ఏమిటి?

జెమిని స్పార్క్ అనేది జెమిని 3.5 మద్దతుతో పనిచేస్తుంది. ఇది Gmail, Chat వంటి గూగుల్ సేవలతో అనుసంధానించబడి ఉంటుంది. అలాగే, MCP ఇంటిగ్రేషన్స్ ద్వారా 30 కి పైగా థర్డ్ పార్టీ ప్లాట్‌ ఫారమ్‌ లకు కూడా ఇది మద్దతు ఇస్తుంది. ఈ AI మోడల్ ముందుగా అనుసంధానించబడిన యాప్స్ నుండి సమాచారాన్ని ఆటోమాటిగ్గా సేకరించగలదని మరియు సారాంశాలను సిద్ధం చేయగలదని కూడా కంపెనీ తెలిపింది.

అంతేకాదు కస్టమర్ అభ్యర్థనలను ట్రాక్ చేయగలదని మరియు నిరంతర మాన్యువల్ ఇన్‌ పుట్ అవసరం లేకుండా పనులను నిర్వహించగలదని కూడా గూగుల్ చెబుతోంది. ఇది మీ జిమెయిల్, గూగుల్ డాక్స్, షీట్స్ క్యాలెండర్ మరియు ఇతర కనెక్టడ్ యాప్స్ తో కనెక్ట్ అయ్యి మీరు చెప్పకముందే కొన్ని పనులు నిర్వహించగలదు.

ఎలాంటి పనులు చేస్తుంది?

ఇమెయిల్స్ డ్రాఫ్ట్ చేయండం, రిమైండర్స్ నిర్వహించడం, మీటింగ్ ప్లానింగ్ మరియు ఆన్లైన్ టాస్క్ లను పూర్తి చేయడం వంటి పనులు చేస్తుంది. ఇవి కాకుండా షాపింగ్ వర్క్ ఫ్లో ను నిర్వహించడం వంటి పనులు చేస్తుంది.

Also Read: Gemini Omni: గూగుల్ బిగ్ ఈవెంట్ నుంచి పవర్ ఫుల్ మల్టీ మోడల్ అనౌన్స్ చేసింది.!

ల్యాప్‌ టాప్ ఆఫ్‌లో ఉన్నా ఎలా పనిచేస్తుంది?

ఈ AI అసిస్టెంట్ Google Cloud పై నడుస్తుంది. అందువల్ల మీ ల్యాప్ టాప్ ఆఫ్‌ లో ఉన్నా కూడా జెమినీ స్పార్క్ క్లౌడ్ ద్వారా టాస్క్ లను కొనసాగించగలదు. ఇదే గూగుల్ స్పార్క్ యొక్క ప్రధాన హైలైట్ అవుతుంది.

ఇక భద్రత నియంత్రణ మరియు వినియోగదారు అనుమతులపై కంపెనీ పని చేస్తున్నందున, కాలక్రమేణా స్పార్క్ యొక్క స్వయంప్రతిపత్తి క్రమంగా విస్తరిస్తుందని గూగుల్ సూచించింది. ఇక ఈ ఫీచర్ లభ్యత విషయానికి వస్తే, జెమిని స్పార్క్ వచ్చే వారం యునైటెడ్ స్టేట్స్‌ లోని గూగుల్ ఏఐ అల్ట్రా సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులోకి రావడం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. మొదటగా జీమెయిల్ మరియు గూగుల్ చాట్ ఇంటిగ్రేషన్ రానుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :