Google engineer Jaana Dogan reveals shocking truths about the power of AI
Jaana Dogan: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజు రోజుకూ ఎవరి ఊహలకందని స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. ముందు సాధారణ స్థాయిలో మాత్రమే ఉన్న AI ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సైతం విస్తుపోయేలా మారింది. ఇందుకు ఉదాహరణగా కొత్త ఆన్లైన్ వచ్చిన ఒక గూగుల్ ఇంజనీర్ ఘటన ఆధారంగా చేసుకోవచ్చు. తాజాగా, గూగుల్ కు చెందిన ఒక సీనియర్ ఇంజినీర్ చేసిన వ్యాఖ్యలు టెక్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశాయి. ఆ ఇంజినీర్ ఎవరో కాదు జానా దోఆన్. ఇప్పుడు ఈ గూగుల్ ఇంజనీర్ చేసిన వ్యాఖ్యలు యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి.
గూగుల్ ప్రిన్సిపల్ ఇంజనీర్, జానా దోఆన్ రీసెంట్ గా తన సోషల్ మీడియా నుంచి ఒక పోస్టు షేర్ చేశారు. ఇందులో ఆమె వెల్లడించిన విషయం ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసింది. ఒక అసలు విషయానికి వస్తే, గూగుల్ లో ఒక క్లిష్టమైన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ (Distributed Agent Orchestrator) మీద రోజు గంటల కొద్దీ పని చేస్తూ సుమారు ఒక సంవత్సరం పాటు కష్టపడి చేసిన అదే పనిని ఒక AI కోడింగ్ టూల్ కేవలం ఒక గంటలోనే చేసి చూపించిందని ఆమె వెల్లడించారు.
ఇది మీరు చూడటానికి చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ డీప్ గా ఆలోచిస్తే మీకు అర్ధం అవుతుంది. ఒక టీమ్ మొత్తం రోజు గంటల్లో కస్టపడి సుమారు సంవత్సరం చేసిన ఒక పనిని ఎఐ మాత్రం జస్ట్ ఒక గంటలోనే ఆ పనిని చేసింది. అంటే, ఎఐ ఎంత అడ్వాన్స్ లెవెల్ కు చేరుకుందో మీకు అర్థం అవుతుంది.
ఆమె ట్వీట్ ప్రకారం, Anthropic కంపెనీకి చెందిన “Claude Code” అనే AI టూల్ ను ఉపయోగించి,ఒక చిన్న ప్రాబ్లం స్టేట్‌మెంట్ ఇవ్వగానే, ఆ ఎఐ టూల్ ‘కోడ్ స్ట్రక్చర్, లాజిక్, ఫ్లో అన్నీ విషయాలు అర్థం చేసుకుని, గంటలోనే పూర్తిగా పని చేసే సిస్టమ్ ను రూపొందించింది. ఈ విషయాన్ని తను చూసిన ఎఐ అద్భుతంగా పేర్కొన్నారు.
Also Read: Samsung 55 ఇంచ్ Smart Tv పై అమెజాన్ భారీ డిస్కౌంట్ డీల్స్ అందుకోండి.!
ఇది పెద్ద చర్చకు దారి తీసిందా? అంటే, అవును నిజంగా ఇది పెద్ద దుమారమే లేపింది. ఎందుకంటే, ఈ ఘటన మూడు పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. అవేమిటంటే, AI ఇంత వేగంగా కోడింగ్ చేస్తే మరియు జూనియర్ డెవలపర్లు రొటీన్ కోడింగ్ జాబ్స్ అంతరించిపోతాయా? అనేది మొదటి ప్రశ్న. ఇప్పటి వరకు నెలలు లేదా సంవత్సరాలు పట్టే ప్రాజెక్టులు ఇకపై వారాల్లో లేదా గంటల్లో పూర్తవుతాయా? ఒకవేళ ఇలా జరిగితే పెద్ద టెక్ కంపెనీల్లో పనితీరు ఎలా ఉండబోతుంది? అనేది రెండో ప్రశ్న. మూడవది మరియు ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ”AI మనకు సహాయకుడా లేక ప్రత్యర్థిగా మారిందా” అనేది మూడవ ప్రశ్న.
కానీ, ఈ ప్రశ్నలకు కూడా ఆమె ట్వీట్ లో సాధనం ఇచ్చారు. AI మనకు ఒక Threat కాదు, అయితే ఇది మరింత వేగంగా పనులు చేసే ప్రొడక్టివిటీ బూస్టర్ అవుతుందని ఆమె తెలిపారు.