మీ ఫోన్ లో ఈ 10 యాప్స్ ఉంటే డిలీట్ చేయండి.. ఎందుకంటే..!!

Updated on 20-Apr-2022
HIGHLIGHTS

మీ ఫోన్ లో ఈ 10 ఆండ్రాయిడ్ యాప్స్ ఉంటే డిలీట్ చేయండి

ఈ యాప్స్ మీ డేటాని సేకరించే హానికరమైన కోడ్ తో ఉన్నాయి

1 కోటి కంటే ఎక్కువ డౌన్ లోడ్స్ చెయ్యబడిన యాప్స్ కూడా వున్నాయి

మీ ఫోన్ లో ఈ 10 ఆండ్రాయిడ్ యాప్స్ ఉంటే డిలీట్ చేయండి. ఎందుకంటే, వినియోగదారుల ఫోన్ నుండి సమాచారాన్ని సేకరిస్తున్న కారణంగా గూగుల్ తన Play Store నుండి ప్రముఖమైన 10 యాప్స్ తొలగించింది. వాస్తవానికి, ఈ పది యాప్స్ కూడా సున్నితమైన డేటాని కూడా సేకరించే హానికరమైన కోడ్ ను కలిగి ఉండడమే ఇందుకు కారణం. అందుకే, గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ 10 యాప్స్ ను నిషేధించినట్లు తెలిపింది.

ఈ పది యాప్స్ లో కొన్ని 10 మిలియన్ల కంటే ఎక్కువ డౌన్ లోడ్స్, అంటే 1 కోటి కంటే ఎక్కువ డౌన్ లోడ్స్ చెయ్యబడిన యాప్స్ కూడా వున్నాయి. Google నిషేధించిన యాప్స్ జాబితాలో QR కోడ్ డిటెక్టర్, వాతావరణ విడ్జెట్ మరియు ముస్లిం ప్రార్థన సమయాల కోసం ప్రోగ్రామ్ వంటివి ఉన్నాయి.

అనేక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో ఉన్న డజన్ల కొద్ధి యాప్స్ లో ఈ హానికరమైన కోడ్ ఉన్నట్లు సెర్జ్ ఎగెల్‌మాన్ మరియు జోయెల్ రియర్డన్ అనే ఇద్దరు సెక్యూరిటీ మరియు ప్రైవసీ పరిశోధకులు కనుగొన్నారు. ఈ కోడ్స్ ద్వారా వినియోగదారు యొక్క ఖచ్చితమైన స్థానం, వారి ఇమెయిల్, ఫోన్ నంబర్స్, సమీపంలోని కంప్యూటర్‌లు మరియు మొబైల్ పరికరాల డేటా, పాస్‌వర్డ్‌ లతో సహా క్లిప్‌బోర్డ్ డేటా, అలాగే Android ఫైల్ సిస్టమ్, ముఖ్యంగా WhatsApp డౌన్‌లోడ్ ఫోల్డర్ వంటి వ్యక్తిగత ఐడెంటి ఫైయర్‌ లను సేకరించగలరు.

అందుకే, గూగుల్ ఈ విధమైన కోడ్స్ కలిగినట్టు;గుర్తుచించిన 10 యాప్స్ ను వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించింది. గూగుల్ ప్లే స్టోరు నుండి నిషేధించబడిన ఆ 10 యాప్స్ వివరాలను క్రింద చూడవచ్చు.

1. QR & Barcode Scanner (Developed by AppSource Hub)

2. Speed Radar Camera

3. Wi-Fi Mouse (Remote Control PC)

4. Qibla Compass – Ramadan 2022

5. Simple Weather & Clock Widget (Developed by Difer)

6. Al-Moazin Lite (Prayer times)

7. Handcent Next SMS- Text With MMS

8. Smart kit 360

9. Audiosdroid Audio Studio DAW

10.Full Quran MP3-50 Languages & Translation Audio  

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :