ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి…లేకపొతే..!

ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి…లేకపొతే..!
HIGHLIGHTS

Google Play Store నుండి కొత్తగా 7 యాప్స్ ను బ్యాన్ చేసింది

ఈ Android యాప్స్ మీ ఫోన్ సెక్యూరిటీని ప్రభావితం చేయవచ్చు

మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకొని ఉంటే డిలేట్ చెయ్యడం మంచిది

ఎప్పటికప్పుడు యాప్స్ ను నిశితంగా పరిశీలించే గూగుల్ తన Play Store నుండి కొత్తగా 7 యాప్స్ ను బ్యాన్ చేసింది. ఫోన్ సెక్యూరిటీకి భంగం కలిగించే 'ట్రోజన్' జోకర్ మాల్వేర్ భారిన పడిన ఒక 7 యాప్స్ ను గూగుల్ నిషేదించింది. అయితే, ఈ యాప్స్ ఇప్పటికే చాలా డౌన్లోడ్స్ సాధించాయి. అందుకే, ఈ యాప్ ను మీరు మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకొని ఉంటే డిలేట్ చెయ్యడం మంచిది. ఎందుకంటే, ఈ యాప్స్ ద్వారా మీకు ట్రోజన్ క్లౌన్ దాడి ప్రమాదం మీ ఫోన్‌కు పొంచివుంటుంది.

వాస్తవానికి, ఈ అప్లికేషన్స్ (Apps) ట్రోజన్ జోకర్ మాల్‌వేర్‌ భారినపడినట్లు సెక్యూరిటీ సంస్థ Kasparsky లో మాల్వేర్ విశ్లేషకుడు టట్యానా షిష్కోవా ఈ విషయాన్ని కనుగొన్న తర్వాత గూగుల్ వీటిని తొలగించింది. ఈ Android యాప్స్ మీ ఫోన్ సెక్యూరిటీని ప్రభావితం చేయవచ్చు.   అందుకే, గూగుల్ ఈ యాప్స్ ను బ్యాన్ చేసింది మరియు వినియోగదారులను హెచ్చరించింది.

లేటెస్ట్ గా గూగుల్ బ్యాన్ చేసిన ఈ యాప్ లలో కొన్ని 50,000 కంటే ఎక్కువ డౌన్లోడ్స్ సాధించిన యాప్స్ కూడా వున్నాయి. ఈ యాప్స్ మీకు తెలియకుండానే మీ ఫోన్ ను ఇతర యాప్స్ లేదా స్కామ్ సబ్ స్క్రిప్షన్ సర్వీస్ లకు మిమ్మల్ని సైన్ అప్ చేయిస్తుంది. మీరు ఈ యాప్‌ల గురించిన అలర్ట్‌లను మిస్ అయితే, వాటి గురించి తెలుసుకోండి మరియు వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి. గూగుల్ బ్యాన్ చేసిన ఆ 7 యాప్స్ ను ఈ క్రింద చూడవచ్చు.

1. Now QRcode Scan

2. EmojiOne Keyboard

3. Battery Charging Animations Battery Wallpaper

4. Dazzling Keyboard

5. Volume Booster Louder Sound Equalizer

6. Super Hero-Effect

7. Classic Emoji Keyboard       

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo