Gemini Omni: గూగుల్ బిగ్ ఈవెంట్ నుంచి పవర్ ఫుల్ మల్టీ మోడల్ అనౌన్స్ చేసింది.!

HIGHLIGHTS

గూగుల్ ఈరోజు అతిపెద్ద కార్యక్రమం Google I/O 2026 ను నిర్వహించింది

ఆర్టిఫీషియల్ మోడల్ లో గూగుల్ ఈరోజు కొత్తగా మల్టీ మోడల్ ను అందించింది

గూగుల్ Gemini Omni మోడల్ నేటి సాంకేతిక ప్రపంచంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తెస్తుందని గూగుల్ తెలిపింది

గూగుల్ రోజు గూగుల్ ఈరోజు నిర్వహించిన అతిపెద్ద కార్యక్రమం Google I/O 2026 ను నిర్వహించింది. ఈ కార్యక్రమం నుంచి కొత్త అప్డేట్స్ అందించింది. గూగుల్ జెమిని అనేది గూగుల్ సంస్థ అభివృద్ధి చేసిన అత్యంత అధునాతనమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్. ఈ శక్తివంతమైన ఆర్టిఫీషియల్ మోడల్ లో గూగుల్ ఈరోజు కొత్తగా మల్టీ మోడల్ ను అందించింది. అదే, గూగుల్ Gemini Omni మోడల్ మరియు దీని సామర్థ్యాలు నేటి సాంకేతిక ప్రపంచంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తెస్తుందని గూగుల్ తెలిపింది.

Gemini Omni: ఏమిటి ఇది?

గూగుల్ జెమిని ఫీచర్ అనేది కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచంలో ఒక విప్లవాత్మకమైన మార్పుగా గూగుల్ తెలిపింది. ఎందుకంటే, సాధారణంగా AI టూల్స్ కేవలం టెక్స్ట్ లేదా ఇమేజ్ వంటి ఏదో ఒక దానిని మాత్రమే అర్థం చేసుకోగలవు. అయితే, గూగుల్ కొత్తగా అందించిన జెమిని ఓమ్ని ఫీచర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఒకే సమయంలో రకరకాల సమాచార రూపాలను అర్ధం చేసుకుని వేగంగా స్పందిస్తుంది. అంటే, టెక్స్ట్, ఆడియో, వీడియో, ఇమేజెస్ మరియు కోడింగ్ లను అర్థం చేసుకుని, క్షణాల్లో రెస్పాన్స్ అందిస్తుంది.

గూగుల్ సంస్థ తన AI విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సరికొత్త టెక్నాలజీ “గూగుల్ జెమిని ఓమ్ని” అని తెలిపింది. ఇది కేవలం టెక్స్ట్ లేదా ఇమేజ్‌లకు పరిమితం కాకుండా, ఒకే ఒక పవర్‌ఫుల్ మోడల్ ద్వారా సమస్త మీడియా (Text, Image, Audio, Video) లను కంట్రోల్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

జెమిని ఓమ్ని అంటే ఏమిటి?

సాధారణంగా AI టూల్స్ టెక్స్ట్ అనేది రాయడానికి ఒక మోడల్. అయితే, ఇమేజ్ క్రియేట్ చేయడానికి మరొక మోడల్ ను మరియు వీడియోల కోసం వేరే ఇతర మోడల్‌ను (ఉదాహరణకు గూగుల్ Veo) విడివిడిగా ఉపయోగిస్తారు. కానీ, ఇప్పుడు కొత్తగా గూగుల్ అందించిన జెమిని ఓమ్ని అఒకే ఒక్క AI మెదడుతో ఇది టెక్స్ట్, ఆడియో, హై-క్వాలిటీ ఇమేజ్స్ మరియు పూర్తి స్థాయి వీడియోలను కూడా నేరుగా జనరేట్ చేయగలదు.

Also Read: Moto Buds 2 బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

Gemini Omni : ముఖ్యమైన ఫీచర్లు

ఈ కొత్త ఫీచర్ తో లైవ్ చాట్ లోనే వీడియో ఎడిటింగ్ చేయవచ్చు.అంటే, మీరు జెమిని చాట్ బాక్స్‌లోనే వీడియో బ్యాక్‌ గ్రౌండ్ మార్చు లేదా లైటింగ్ చేంజ్ వంటివి జస్ట్ టైప్ చేస్తే చాలు, ఎటువంటి ఎడిటింగ్ సాఫ్ట్‌ వేర్ లేకుండానే వీడియోను ఎడిట్ చేస్తుంది.

వీడియో రీమిక్సింగ్ కూడా ఇందులో ఉంటుంది. మీరు అప్‌ లోడ్ చేసిన పాత వీడియో క్లిప్‌ లను ఉపయోగించి, కొత్త కమాండ్స్ ద్వారా వాటి స్టైల్‌ ను పూర్తిగా మార్చి సరికొత్త వీడియోగా క్రియేట్ చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :