ఇక రేషన్ సరుకులకు కూడా ATM మెషిన్

ఇక రేషన్ సరుకులకు కూడా ATM మెషిన్
HIGHLIGHTS

రేషన్ సరుకులకు కూడా ATM మెషిన్

నిక్కచ్చి తూకంతో సరుకులను పొందేవీలుంటుంది

దేశంలో ఎక్కడి నుండైనా మీరు రేషన్ తీసుకోవచ్చు

నగదు కోసం ATM మిషన్ల వద్దకు వెళ్లినట్లు ఇక రేషన్ సరుకులకు కూడా ATM మెషిన్ సందర్శించాల్సి రావచ్చు. ఇదేదో ఫిక్షన్ అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే, హరియాణాలోని గురుగ్రామ్ లో ఇటీవల పైలెట్ ప్రోజెక్ట్ కొండా గ్రైన్ ఎటిఎం మిషన్ ను ఏర్పాటుచేశారు. ఇదే దేశంలోని మొదటి గ్రైన్ ఎటిఎం అవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో రేషన్ కోసం ఇంకా రేషన్ షాపుల్లో క్యూలో వేచిచూడాల్సివస్తుండగా, కొన్ని రాష్ట్రాల్లో నేరుగా ఇంటికే రేషన్ అందించబడుతుంది. అయితే, ఈ కొత్త గ్రైన్ ATM మెషిన్ ల వలన టైం సేవ్ మరియు నిక్కచ్చి తూకంతో సరుకులను పొందేవీలుంటుంది.

మీ రేషన్ కార్డ్ ను ఉపయోగించి దేశంలో ఎక్కడి నుండైనా మీరు రేషన్ తీసుకోవచ్చు. దీనికొసం మేరా రేషన్ యాప్ ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. మేర రేషన్ యాప్ ద్వారా రేషన్ లభిధారులు వారి దగ్గరలోని రేషన్ షాప్ మరియు దాని వివరాలను కూడా పొందవచ్చు. రేషన్ కార్డు వున్న ప్రతి ఒక్కరికి రేషన్ అందేలా చూసేందుకు ప్రభుత్వం ఈ 'మేరా రేషన్' మొబైల్ యాప్ ను లాంచ్ చేసినట్లు తెలిపింది.                                   

మేరా రేషన్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ప్లే స్టోర్ నుండి అందుబాటులో వుంది మరియు దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీ దగ్గర్లోని రేషన్ షాప్ వివరాలను తెలుసుసుకోవడమే కాకుండా రేషన్ సామునుల ధర వివరాలు కూడా తెలుసుకోవచ్చు.     

 మేరా రేషన్ మొబైల్ యాప్

ఈ యాప్ ను ఉపయోగించాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయాలి. అందుకే, ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా, గూగుల్ ప్లే స్టోర్ నుండి మేరా రేషన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. తరువాత,  మీ రేషన్ కార్డు నంబర్ తో రిజిష్టర్ చేసుకోవాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo