ఒక్కరోజే రూ.1,050 తగ్గిన బంగారం ధర..!!

HIGHLIGHTS

ఈరోజు బంగారం ధర ఈ నెల కనిష్ఠాన్ని నమోదు చేసింది

బంగారం ధర ఒక్కరోజే 1,050 రూపాయలు పడిపోయింది

మరొకసారి భారీగా తగ్గిన బంగారం

ఒక్కరోజే రూ.1,050 తగ్గిన బంగారం ధర..!!

ఈరోజు బంగారం ధర ఈ నెల కనిష్ఠాన్ని నమోదు చేసింది. వాస్తవానికి, ఈ నెల ప్రారంభం నుండి బంగారం పెరుగుదలను నమోదు చేసింది. అనూహ్యంగా, నిన్న ఒక్కరోజే 1,050 రూపాయలు పడిపోయింది. ఈ నెల ప్రారంభం నుండి దాదాపుగా 2000 పైచిలుకు పెరిగిన బంగారం నిన్న ఒక్కరోజే 1,050 రూపాయలు తగ్గింది. ఈరోజు బంగారం ధర తటస్తంగా కొనసాగుతోంది. ఈరోజు 51,710 వద్ద ప్రారంభమయిన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్, 10 రూపాయలు క్రిందకు దిగి 51,700 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ ప్రధాన నగరాల్లో ఈ రోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,400 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,390 రూపాయలుగా ఉంది. అంటే, ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర తటస్తంగా వుంది.  అలాగే, నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,710 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,700 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,390 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,700 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,390 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,700 గా ఉంది.       

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,390 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,700 గా ఉంది. ఈరోజు కూడా  దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,540 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,870 గా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo