Gold Live: ఈరోజు బంగారం ధర అప్డేట్ పైన ఒక లుక్ వేద్దామా.!

Gold Live: ఈరోజు బంగారం ధర అప్డేట్ పైన ఒక లుక్ వేద్దామా.!
HIGHLIGHTS

ప్రస్తుతం గోల్డ్ మార్కెట్ అంచనాలకు అందుకుండా పరిగెడుతోంది

గత నెలలో దాదాపుగా స్థిరంగా కొనసాగిన గోల్డ్ మార్కెట్

ఈ నెల మాత్రం అంచనాలకు అందనంటోంది

ప్రస్తుతం గోల్డ్ మార్కెట్ అంచనాలకు అందుకుండా పరిగెడుతోంది. బంగారం ధర ఎప్పుడు పెరుగుతోందో, ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. గత నెలలో దాదాపుగా స్థిరంగా కొనసాగిన గోల్డ్ మార్కెట్, ఈ నెల మాత్రం అంచనాలకు అందనంటోంది. గత మూడు రోజులు క్రిందకు దిగిన బంగారం ధర ఈరోజు స్వల్పంగా పైకి ఎగబాకింది. మరి రోజు బంగారం ధర అప్డేట్ పైన ఒక లుక్ వేద్దామా. 

Gold Live: 

ఈరోజు ప్రధాన మార్కెట్ లో రూ.54,500 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.200 రూపాయలు పెరిగి  రూ.54,700 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, రూ.59,450 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ.59,670 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, ఈరోజు కూడా బంగారం ధర రూ.220 రూపాయలు పెరిగింది.

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు బంగారం ధర చూస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,700 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,670 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,700 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,670 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,850 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.59,820 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,450 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,490 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo