Gold Rate stable on Akshaya Tritiya festival day
Akshaya Tritiya Gold Rate: 2026 అక్షయ తృతీయ పండుగ ఒకరోజు ఉండగా నిన్న మార్కెట్లో పసిడి రేటు 10 గ్రాములకు రూ. 810 రూపాయలు పెరిగి గరిష్ట రేటును నమోదు చేసింది. అయితే, పండుగ రోజు గోల్డ్ ఇంకెంత పెరుగుతుందో అని పసిడి ప్రియులు కంగారు పడినట్లు చెబుతున్నారు. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ గోల్డ్ రేటు ఈరోజు స్థిరముగా కొనసాగింది. పండుగ రోజు పసిడి ప్రియులకు ఇది నిజంగా గుడ్ న్యూస్.
ఈరోజు పసిడి ప్రియులకు ఇష్టమైన పండుగ అక్షయ తృతీయ జరుపుకుంటారు. అందుకే, ఈరోజు ఉదయం నుంచి పసిడి ప్రియులు గోల్డ్ షాపుల ముందు క్యూ కట్టి మరి గోల్డ్ కొనుగోలు చేస్తారు. అయితే, ఇటీవల గోల్డ్ రేటు పెరిగిన తీరు గమనిస్తే, గోల్డ్ కొనుగోలు చేయడం అనేది పెనుభారంగా మారింది. అయితే, కనీసం ఒక్క గ్రాము బంగారం అయినా కొనడానికి పసిడి ప్రియులు ఈరోజు ఆసక్తి చూపిస్తారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ క్లోజ్ కావడంతో గోల్డ్ రేట్ ఎటువంటి పెరుగుదల నమోదు చేయలేదు. నిన్న మార్కెట్లో కొనసాగిన అదే రూ. 15,578 రూపాయల వద్ద ఈరోజు కూడా గోల్డ్ రేటు నడుస్తోంది. అంటే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 1,55,780 వద్ద నడుస్తోంది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 1,55,780 రూపాయల వద్ద నడుస్తోంది.
ఈరోజు దేశంలో ఉన్న ప్రధాన నగరాలు మరియు తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన సిటీ లలో నడుస్తున్న గోల్డ్ ప్రైస్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
24 క్యారెట్ (10 గ్రాములు): రూ. 1,55,930
22 క్యారెట్ (10 గ్రాములు): రూ. 1,42,950
24 క్యారెట్ (10 గ్రాములు): రూ. 1,55,780
22 క్యారెట్ (10 గ్రాములు): రూ. 1,42,800
24 క్యారెట్ (10 గ్రాములు): రూ. 1,55,780
22 క్యారెట్ (10 గ్రాములు): రూ. 1,42,800
24 క్యారెట్ (10 గ్రాములు): రూ. 1,56,660
22 క్యారెట్ (10 గ్రాములు): రూ. 1,43,600
24 క్యారెట్ (10 గ్రాములు): రూ. 1,55,780
22 క్యారెట్ (10 గ్రాములు): రూ. 1,42,800
Also Read: Redmi A7 Series నుంచి కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న షియోమీ.!
ఇక తెలుగు రాష్ట్ర ప్రధాన సిటీలు, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, విజయవాడ, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ మరియు కరీంనగర్ లలో కూడా 24 క్యారెట్ (10 గ్రాములు) గోల్డ్ రేట్ రూ. 1,55,780 గా ఉంది మరియు 22 క్యారెట్ (10 గ్రాములు) గోల్డ్ రేట్ రూ. 1,42,800 గా ఉంది.
గమనిక: ఇక్కడ అందించినది లైవ్ గోల్డ్ రేట్ అప్డేట్ కాబట్టి లోకల్ మార్కెట్ మరియు షాప్ లలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంటుంది.