Gold Live: ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ పైన ఒక లుక్కేద్దామా.!

Gold Live: ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ పైన ఒక లుక్కేద్దామా.!
HIGHLIGHTS

పసిడి ప్రియులకు ప్రస్తుత గోల్డ్ మార్కెట్ మింగుడు పడని విషయంగా మారింది

భారీగా పరుగుదలను నమోదు చేసిన గోల్డ్ మార్కెట్

ఈరోజు కూడా తులం బంగారం ధర 60 వేల మార్క్ పైనే కొనసాగుతోంది

పసిడి ప్రియులకు ప్రస్తుత గోల్డ్ మార్కెట్ మింగుడు పడని విషయంగా మారింది. గత పదిరోజుల్లో చాలా భారీగా పరుగుదలను నమోదు చేసిన గోల్డ్ మార్కెట్ నిన్న స్వల్పంగా క్రిందకు దిగింది. అయితే, ఈరోజు మళ్ళీ గోల్డ్ సూచీలు స్వల్పంగా పైకి ఎగబాకాయి. ఈరోజు కూడా తులం బంగారం ధర 60 వేల మార్క్ పైనే కొనసాగుతోంది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఏమిటో చూద్దామా.

Gold Rate:

ఈరోజు ప్రధాన మార్కెట్ లో రూ.54,800 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.200 రూపాయలు పెరిగి రూ.55,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, రూ.59,780 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ.60,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, ఈ ఒక్కరోజే రూ.220 రూపాయలు పెరిగినట్లు మనం చూడవచ్చు.

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు బంగారం ధర చూస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,000 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,000 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.60,150 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే కోయంబత్తూర్ లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు కోయంబత్తూర్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,770 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo