Gold Rate: ఈరోజు పడిపోయిన బంగారం ధర..మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి.!

Gold Rate: ఈరోజు పడిపోయిన బంగారం ధర..మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

ఈరోజు మార్కెట్ లో పడిపోయిన బంగారం ధర

0 రోజులుగా సాగిన గోల్డ్ మార్కెట్ జైత్రయాత్రకు ఈరోజు ఫుల్ స్టాప్ పడింది

గోల్డ్ మార్కెట్ నష్టాలను చవిచూసి, బంగారం ధర క్రిందకు పడిపోయింది

Gold Rate: ఈరోజు మార్కెట్ లో పడిపోయిన బంగారం ధర. గత 10 రోజులుగా సాగిన గోల్డ్ మార్కెట్ జైత్రయాత్రకు ఈరోజు ఫుల్ స్టాప్ పడింది. గత నెల నుండి ఈ నెల మధ్య వరకూ స్థిరంగా సాగిన బంగారం ధర ఒక్కసారిగా ఊపందుకొని 10 రోజుల్లో తులం దాదాపుగా 3,500 రూపాయల వరకూ పెరిగింది. అంతేకాదు, చాలా కాలం తరువాత గోల్డ్ మార్కెట్ 60 వేల మార్క్ ను క్రాస్ చేసింది. అయితే, ఈరోజు మళ్ళీ గోల్డ్ మార్కెట్ నష్టాలను చవిచూసి, బంగారం ధర క్రిందకు పడిపోయింది.

Gold Rate:

ఈరోజు ప్రధాన మార్కెట్ లో రూ.55,300 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.500 రూపాయలు క్రిందకు దిగి రూ.54,800 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, రూ.60,320 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ.59,780 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, ఈ ఒక్కరోజే రూ.540 రూపాయలు పెరిగినట్లు మనం చూడవచ్చు.

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు బంగారం ధర చూస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,780 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,780 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,950 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.59,930 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే కోయంబత్తూర్ లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు కోయంబత్తూర్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,650 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo