Gold Rate Live: ఈరోజు స్వల్పంగా దిగిన బంగారం ధర.!

HIGHLIGHTS

బంగారం ధర ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగింది

బంగారం ధర నిలకడగా కొనసాగినా ఈరోజు మాత్రం స్వల్పంగా పడిపోయింది

వోడిదిడుకులను ఎదుర్కొంటున్న గోల్డ్ మార్కెట్

Gold Rate Live: ఈరోజు స్వల్పంగా దిగిన బంగారం ధర.!

బంగారం ధర ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగింది. గత రెండు రోజులుగా బంగారం ధర నిలకడగా కొనసాగినా ఈరోజు మాత్రం స్వల్పంగా పడిపోయింది. కానీ, ఇది పెద్ద మార్పేమీ కాదు మరియు ఇప్పటికీ మార్కెట్ లో బంగారం ధర ప్రియంగానే వుంది. అయితే, వోడిదిడుకులను ఎదుర్కొంటున్న గోల్డ్ మార్కెట్ చాలాకాలంగా స్థిరత్వాన్ని కనబరుస్తోంది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా కొనసాగుతోందో చూద్దామా.       

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Gold Rate Live:

ఈరోజు ఉదయం రూ.51,850 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 200 రూపాయలు క్రిందకు దిగి రూ.51,650 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ.56,550 రూపాయల నుండి రూ.56,350 వద్దకు చేరుకుంది.    

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,350 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,350 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.56,500 గా ఉంది. అలాగే, ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,350 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,110 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo