Gold Rate: ఈరోజు కూడా పెరిగిన బంగారం ధర..ఎంతంటే.!

Gold Rate: ఈరోజు కూడా పెరిగిన బంగారం ధర..ఎంతంటే.!
HIGHLIGHTS

Gold Rate ఈరోజు కూడా పెరిగింది

ఇన్వెస్ట్ చేసిన వారికి మాత్రం ప్రస్తుత గోల్డ్ మార్కెట్ శుభ సూచికంగా వుంది

పెరుగుతున్న బంగారం ధరతో కొనుగోలుదారుల దిగాలు

Gold Rate: ఈరోజు కూడా పెరిగిన బంగారం ధర. దీపావళి మరియు దసరా పండుగ సీజన్ కావడంతో మార్కెట్లో బంగారం కళ కళలాడుతోంది. అయితే, పసిడి ప్రియులకు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధర మిగుడు పడడంలేదు. కానీ, రీసెంట్ గా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసిన వారికి మాత్రం ప్రస్తుత గోల్డ్ మార్కెట్ శుభ సూచికంగా వుంది. ఇక ఈరోజు మార్కెట్లో గోల్డ్ రేట్ ను పరిశీలిస్తే, ఈరోజు కూడా తులానికి 450 రూపాయలకు పైగా పెరిగింది. మరి ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రధాన నగరాలతో పాటుగా దేశరాజధానిలో గోల్డ్ రేట్ ఎలా ఉందో చూద్దాం పదండి.

Gold Rate:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,350 రూపాయలుగా ఉండగా, ఈరోజు 400 రూపాయలు పెరిగి 47,750 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.52,100 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,760 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100 గా ఉంది.  

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.52,050 గా ఉంది. ఈరోజు కూడా   దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750 గా ఉంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo