gold price increased before Akshaya Tritiya festival and know today live update
Akshaya Tritiya సందర్భంగా పుంజుకున్న Gold Price ఈరోజు గరిష్టానికి చేరుకుంది. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం చాలా శుభమని అందరూ భావిస్తారు. అందుకే, ప్రతి సంవత్సరం ఈ పండుగ సమయంలో గోల్డ్ డిమాండ్ భారీగా పెరుగుతుంది. 2026 అక్షయ తృతీయ పండుగ రేపు కావడంతో గోల్డ్ రేట్ మరింతగా పెరిగింది. దేశ మరియు రాష్ట్ర గోల్డ్ మార్కెట్ లో ఈరోజు నెలకొన్న నడుస్తున్న గోల్డ్ ప్రైస్ లైవ్ అప్ డేట్ తెలుసుకోండి.
రేపు అనగా ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం రోజున తృతీయ పండుగ జరుపుకుంటారు. తృతీయ పండుగ రోజు గోల్డ్ మరియు సిల్వర్ కొనుగోలు చేయడం మన దేశంలో చాలా శుభప్రభం గా భావిస్తారు. అయితే, తృతీయ పండుగ రోజు గోల్డ్ డిమాండ్ తారా స్థాయికి చేరుకుంటుంది కాబట్టి, గోల్డ్ రేటులో కూడా గణనీయమైన మార్పు చోటుచేసుకుంటుంది. ఈరోజు మార్కెట్ లో నడుస్తున్న గోల్డ్ రేటు అప్డేట్ చూస్తుంటే, ఈ సంవత్సరం కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
ఈరోజు భారత మార్కెట్లో గోల్డ్ రేటు పెరుగుదల నమోదు చేసింది. నిన్న మార్కెట్లో రూ. 15,497 రూపాయల ధరతో క్లోజ్ అయిన 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్, ఈరోజు ఉదయం నుంచి మార్కెట్ లో లాభాలు నమోదు చేసి గ్రాముకు రూ. 81 రూపాయలు పెరిగి రూ. 15,578 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ ఈరోజు రూ. 1,55,780 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 1,55,780 రూపాయలుగా నమోదయ్యింది.
ఇక ఈరోజు దేశంలో నడుస్తున్న గోల్డ్ ప్రైస్ విషయానికి వస్తే, ఈరోజు దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగుళూరు మరియు హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల గోల్డ్ ప్రైస్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.
24 క్యారెట్ (10 గ్రాములు): రూ. 1,55,930
22 క్యారెట్ (10 గ్రాములు): రూ. 1,42,950
24 క్యారెట్ (10 గ్రాములు): రూ. 1,55,780
22 క్యారెట్ (10 గ్రాములు): రూ. 1,42,800
24 క్యారెట్ (10 గ్రాములు): రూ. 1,55,780
22 క్యారెట్ (10 గ్రాములు): రూ. 1,42,800
24 క్యారెట్ (10 గ్రాములు): రూ. 1,56,660
22 క్యారెట్ (10 గ్రాములు): రూ. 1,43,600
24 క్యారెట్ (10 గ్రాములు): రూ. 1,55,780
22 క్యారెట్ (10 గ్రాములు): రూ. 1,42,800
Also Read: Vivo X300 FE మరియు X300 Ultra ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన వివో.!
అంతేకాదు, తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన, విజయవాడ, వరంగల్, నిజామాబాద్ మరియు విశాఖపట్నం లలో కూడా 24 క్యారెట్ (10 గ్రాములు) గోల్డ్ రేట్ రూ. 1,55,780 గా ఉండగా 22 క్యారెట్ (10 గ్రాములు) గోల్డ్ రేట్ రూ. 1,42,800 వద్ద నడుస్తోంది.
గమనిక: మేము లైవ్ గోల్డ్ రేట్ అప్డేట్ అందించాము. ఈ రేటులో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది.