Gold Price Down: గత 12 రోజులుగా ఆగకుండా పెరుగుతూ వస్తున్న గోల్డ్ మార్కెట్ కు ఈరోజు బ్రేకులు పడ్డాయి. గడిచిన 12 రోజుల్లో బంగారం ధర దాదాపుగా 3 వేలకు పైగా పెరిగింది. అయితే, ఈరోజు నష్టాలను చూసిన గోల్డ్ మార్కెట్ 65 వేల మార్క్ వద్దకు చేరుకుంది. మరి ఈరోజు దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Gold Price Down:
గడిచిన 12 రోజులుగా నాన్ స్టాప్ గా గోల్డ్ మార్కెట్ లాభాలను చూస్తూనే వచ్చింది. అంతేకాదు, నిన్నటి వరకు బంగారం ధర 66 వేల మార్కు పైనే కొనసాగింది. అయితే, ఈరోజు తులానికి రూ. 420 రూపాయల నష్టాన్ని చూసిన గోల్డ్ మార్కెట్ ఎట్టకేలకి 65 వేల మార్కుకి చేరుకుంది.
మార్చి 1వ తేదీ రూ. 63,160 రూపాయల వద్ద ప్రారంభమైన బంగారం ధర గడిచిన 12 రోజుల్లో రూ. 3,100 రూపాయలు పెరిగి రూ. 66,260 వద్దకు చేరుకుంది. అయితే, చివరి రెండు రోజులు స్థిరంగా నిలిచిన బంగారం ధర, ఈరోజు మాత్రం స్వల్పంగా క్రిందకు దిగి రూ. 65,840 వద్దకు చేరుకుంది.