COVID 19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ నిముషంలో మీ వాట్సాప్ నంబర్ పైన ఇలా అందుకోండి

HIGHLIGHTS

వాక్సిన్ సర్టిఫికెట్ విధిగా డౌన్లోడ్ చేసుకోవాలి

చాలా సులభంగా సర్టిఫికెట్ ను వాట్సాప్ నంబర్ పైన పొందవచ్చు

వాట్సాప్ నుండి చాలా సులభంగా పొందవచ్చు

COVID 19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ నిముషంలో మీ వాట్సాప్ నంబర్ పైన ఇలా అందుకోండి

దేశవ్యాప్తంగా నానాటికి పెరుగుతున్న కరోనా కేసులను మరింతగా అదుపులోకి తీసుకోచ్చేందుకు మరియు COVID 19 ఉదృతిని తగ్గించేందుకు ప్రతి ఒక్కరికి వాక్సిన్ ను అందించే దిశగా ప్రభుత్వం చెర్యలు తీసుకుంటోంది. అంతేకాదు, వ్యాక్సిన్ తీసుకున్న ప్రతిఒక్కరూ కూడా దాని సర్టిఫికెట్ ను విధిగా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా సూచింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ చాటింగ్ యాప్ Whatsapp చాట్ బోట్ ను కూడా ప్రారంభించింది. దీని ద్వారా COVID 19 వ్యాక్సిన్ తీసుకున్నవారు ఒక్క నిముషం లోపలే చాలా సులభంగా వారి సర్టిఫికెట్ ను వారి వాట్సాప్ నంబర్ పైన పొందవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ను కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమమైన మార్గం. అలాగే, ముందు ముందు రోజుల్లో ఆధార్ మాదిరిగా COVID 19 వాక్సిన్ సర్టిఫికెట్ కూడా అత్యంత ఆవశ్యకమైన పత్రాలలో ఒకటిగా మరీనా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. అందుకే, వాక్సిన్ సర్టిఫికెట్ ను వాట్సాప్ నుండి చాలా సులభంగా ఎలా పొందవచ్చునో చూద్దాం.

వాట్సాప్ నుండి COVID 19 వాక్సిన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ 

భారత ప్రభుత్వం, COVID కి సంబంధించి ప్రజలకు అవసరమైన సహాయం చేయడానికి MyGov కరోనా హెల్ప్‌డెస్క్ WhatsApp చాట్‌బాట్‌ను ప్రారంభించింది. మీ కోవిడ్ -19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్ చేయడానికి కూడా ఇప్పుడు మీరు ఈ చాట్‌బాట్‌ను ఉపయోగించవచ్చు.

దీనికోసం మీరు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు. MyGov కరోనా హెల్ప్‌డెస్క్ WhatsApp నంబర్ +91 9013151515 ను మీ కాంటాక్ట్ లిస్ట్ లో సేవ్ చేసుకోవాలి. తరువాత, మీ వాట్సాప్ ను తెరిచి ఒకసారి రిఫ్రెష్ చేయాలి. ఆ తర్వాత మీరు మీ ఫోన్‌లో సేవ్ చేసిన ఈ MyGov నంబర్ ను సెర్చ్ బార్‌లో వెతకాలి.  మీ సేవ్ చేసుకున్న ఈ నంబర్ వచ్చిన ఈ నంబర్ పైన చాట్ బాక్స్ లేదా విండోకి వెళ్ళాలి.

ఇప్పుడుమీరు ఈ చాట్ బాక్స్‌లో డౌన్‌లోడ్ సర్టిఫికెట్‌ను టైప్ చేయండి. మీరు దీన్ని నమోదు చేసిన వెంటనే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు WhatsApp నుండి OTP వస్తుంది. ఈ OTP ఆరు అంకెలతో వుంటుంది మరియు మీరు దాన్ని నమోదు చేయండి. అంతే, మీ నంబర్ పైన ఎన్ని వాక్సిన్ సర్టిఫికెట్స్ నమోదు చేయబడ్డాయో అన్ని మీకు లిస్ట్ రూపంలో చూపించబడతాయి. వాటిలో మీకు కావాల్సిన సర్టిఫికెట్ ఎంచుకొని మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo