Gemini 3.5 latest family of models combining frontier intelligence with action introduced
Gemini 3.5: గూగుల్ రోజు ప్రత్యేకంగా నిర్వహించిన అతిపెద్ద ఈవెంట్ గూగుల్ I/0 2026 నుంచి జెమినీ 3.5 ని పరిచయం చేసింది. ఈ కొత్త వెర్షన్ లో AI కేవలం ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం మాత్రమే కాదు మన కోసం పనులు కూడా చేయగలదని గూగుల్ తెలిపింది.గూగుల్ దీనిని “Frontier Intelligence with Action” అని పిలుస్తోంది. మరి గూగుల్ కొత్తగా పరిచయం చేసిన ఈ కొత్త వెర్షన్ ఏమిటో చూద్దామా.
జెమినీ 3.5 అనేది గూగుల్ తయారు చేసిన అత్యాధునిక AI మోడల్. ఇది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలదు, ఇమేజెస్ మరియు వీడియోలు అర్థం చేసుకోగలదు, కోడ్ రాయగలదు మరియు మన పనులను కూడా ఆటోమేటిక్‌గా పూర్తి చేయగలదు. ఇది పాత AI chatbots కంటే చాలా అడ్వాన్స్డ్ మోడల్.
ఇప్పటి వరకు AI అంటే కేవలం మీరు అడిగిన వాటికి మాత్రమే జవాబు ఇచ్చేది. కానీ, జెమినీ 3.5 మోడల్ మీ కోసం టాస్క్ లు కంప్లీట్ చేయగలదు. అంతేకాదు, ఇమెయిల్స్ పంపడం, షెడ్యూల్స్ మేనేజ్ చేయండం మరియు ఆన్లైన్ పనులు కూడా ఆటోమేట్ చేస్తుంది.
జెమినీ 3.5 చాలా వేగంగా పనిచేస్తుంది మరియు కష్టమైన ప్రశ్నలు కూడా ఇట్టే అర్థం చేసుకుని వేగంగా జవాబులు ఇస్తుంది. డెవలపర్స్ కోసం ఇది కోడ్ రాయడం, బడ్స్ ఫిక్స్ చేయడం మరియు వెబ్ సైట్ బిల్డ్ చేయడం వంటి పనులు కూడా చేయగలదు. ఇది కూడా ఒక మల్టీ మోడల్ ఏఐ మరియు టెక్స్, ఇమేజ్, వీడియో అన్నింటినీ అర్థం చేసుకోగలదు. యూజర్ రిపీట్ చేసే పనులను ఆటోమేట్ చేస్తుంది.
Also Read: Google I/O 2026: ల్యాప్ టాప్ ఆఫ్ లో ఉన్నా పనిచేసే Gemini Spark ఫీచర్ అందించిన గూగుల్.!
జెమినీ 3.5 లో సేఫ్టి మరియు ప్రైవసీ ని మరింత మెరుగు పరిచినట్లు గూగుల్ పేర్కొంది. కానీ కొంతమంది నిపుణులు మాత్రం డేటా యాక్సెస్ మరియు AI కంట్రోల్స్ విషయంలో కొత్త జాగ్రత్త వహించడం మంచిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జెమినీ 3.5 లాంటి ఏఐ సిస్టం వలన ను కంప్యూటర్ ను ఉపయోగించే విధానం పూర్తిగా మారొచ్చు. AI మన పర్సనల్ అసిస్టెంట్ గా మారవచ్చు మరియు చాలా పనులు ఆటోమేటిక్ గా మారవచ్చని ఊహిస్తున్నారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, భవిష్యత్తులో AI ఎలా ఉండబోతుందో చెప్పడానికి జెమినీ 3.5 ఒక చిన్న ఉదాహరణ అని చెప్పవచ్చు.