Garena Free Fire గేమర్స్ కు గుడ్ న్యూస్ అందించింది. గేమ్ యొక్క క్యారెక్టర్స్ ను ప్లేయర్స్ కోసం 50% డిస్కౌంట్ తో అందిస్తున్నట్లు ప్రకటించింది. అంటే, డబ్బు ఎక్కువ ఖర్చుచెయ్యకుండానే ప్లేయర్స్ వారికీ నచ్చిన క్యారెక్టర్ ను పొందవచ్చు. అయితే, ఈ అఫర్ ను కేవలం పరిమిత కాలంతో మాత్రమే అఫర్ చేస్తోంది. కాబట్టి, ప్లేయర్స్ ఈ అఫర్ ను పొందడానికి త్వరపడాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం నవంబర్ 21, 2021 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
Survey
✅ Thank you for completing the survey!
Garena Free Fire యొక్క స్వభావం కారణంగా, పర్ఫెక్ట్ క్యారెక్టర్ ను కలిగి ఉండడం వలన ప్లేయర్స్ యొక్క సామర్ధ్యాలు మరింతగా పెంపొందుతాయి. ఎందుకంటే, ఆట సమయంలో ఈ క్యారెక్టర్ పెద్ద అడ్వాంటేజ్ ను ఇస్తాయి. అంటే, Free Fire లో చాలా క్యారక్టర్లు ప్రత్యేక సామర్థ్యాలతో వస్తాయి. అయితే, ప్లేయర్లు వారికీ సరైన ఎంపికను కనుగొనడానికి ప్లేయర్ స్వంత ప్లే స్టైల్ తో పాటుగా ప్రతి పాత్ర యొక్క సామర్థ్యాలపై మంచి అవగాహన కూడా అవసరం.
గేమ్ యొక్క క్యారెక్టర్స్ ను తీసుకోవాలని చాల కాలంగా ఆలోచిస్తున్నట్లయితే ఇదే మీకు సరైన సమయం కావచ్చు. ప్లేయర్స్ కొనలేకపోయిన పోయిన పాత్ర ఒకటుంది అదే Jai. ఎందుకంటే, Free Fire ఈ పాత్రను ఈ సంవత్సరం జూలైలో గేమ్ నుండి తొలగించింది. కానీ, ఈ పాత్రను అప్పటికే కొనుగోలు చేసిన వారు మాత్రం ఉపయోగించవచ్చు. ఈ పాత్ర బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ను ఆధారంగా చేసుకొని నిర్మించారు మరియు ఇది సూపర్ పవర్స్ తో వస్తుంది.