అత్యవసర పరిస్థితుల్లో EPF అకౌంట్ నుండి అడ్వాన్స్ పొందడం ఎలాగో తెలుసుకోండి.

HIGHLIGHTS

తమ EPF అకౌంట్ నుండి కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అడ్వాన్స్ కోసం అప్లై చేయవచ్చు.

అత్యవసర పరిస్థితుల్లో EPF అకౌంట్ నుండి అడ్వాన్స్ పొందడం ఎలాగో తెలుసుకోండి.

ఉద్యోగి కొన్ని ప్రత్యేక పరిస్థితులలో EPF అకౌంట్ నుండి అడ్వాన్స్ కోసం అప్ప్లై చేయవచ్చు. వైద్య సహాయం, పెళ్లి కోసం, ఇల్లు కట్టుకోవడానికి లేదా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, సొంత ఇంటి లోన్ తిరిగి చెల్లించడానికి, చదువు కోసం, వంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఉద్యోగి తన EPF నుండి అడ్వాన్స్ కోసం అభ్యర్ధన చేసుకోవచ్చు. దీనిని ఎలాగా చేయాలో చూద్దాం.              

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ముందుగా EPFO యొక్క అధికారక వెబ్సైట్ లోకి ప్రవేశించి, మీ యొక్క UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ని యాక్టీవేట్ చేసుకోవాలి( ఇప్పటి వరకు చేయనివారికోసం). వెబ్సైట్ కోసం EPFO  పైన క్లిక్ చేయండి.       

EPF నుండి అడ్వాన్స్ కోసం ఎదురుస్తున్నవారు, వారి అభ్యర్థనను ఆన్లైన్లో EPFO వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చు. మీ UAN మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబరుతో ఇక్కడ  మేము సూచించిన విధంగా చేయండి.

1. మొదట మీరు www.epfindia.gov.in వెబ్సైటుకు వెళ్లి ఇక్కడ చూపిన విధంగా క్లిక్ చేయండి .

2.  తర్వాత మీరు UAN / ఆన్లైన్ సర్వీస్ (OCS / OTP) యొక్క సభ్యునికి దాని సర్వీసు పేజీకి మళ్ళించబడతారు.

3. సర్వీసుల కింద సభ్యుని UAN / ఆన్లైన్ సర్వీస్ (OCS / OTP) పై క్లిక్ చేసిన తర్వాత మీరు మీ UAN మరియు పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన పట్టికలో టైప్ చేయండి.

4. మీ UAN మరియు పాస్ వర్డు టైప్ చేసి  ఎంటర్ చేసిన తర్వాత, మీరు Manage పైన నొక్కండి. ఆ తర్వాత దానిలో కనిపించే 4 విభాగాలలో KYC పైన క్లిక్ చేయండి.

5. ఈ KYC లో మీ యొక్క ఆధార్, PAN మరియు బ్యాంకు వివరాలను నమోదుచేసి ఎంటర్ చేయండి. (ఈ వివరాలను ఇప్పటి వరకు నమోదు చేయని వారికోసం) ఇవి మీకు అప్డేట్ అవడానికి కొంత సమయం పడుతుంది. 

6. ఇప్పుడు పైన కనిపించే, Online Services పైన నొక్కడం ద్వారా లోనికి ప్రవేశించి, అందులోని Claim ఎంచుకోండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ యొక్క చివరి 4 అంకెలను నమోదు చేసి ఎంటర్ చేయండి.

7.  ఇక్కడ మీ వివరాలతో పాటుగా 'I  Want To Apply For' అని కనిపిస్తుంది. ఇందులోకి వెళ్లి PF Advance (Form-31) ఎంచుకొని మీరు ఎటువంటి అవసరం కోసం మీరు  మీ PF నుండి అడ్వాన్స్ కోసం అప్ప్లై చేస్తున్నారో ఎంచుకొవాల్సివుంటుంది.

8. ఇక్కడ మీ పూర్తి చిరునామా నమోదు  చేసిన తరువాత సబ్మిట్ చేయాలి.   

9. ఆన్లైన్ అవకాశం లేనివారు EPF ఆఫీసునందు Form – 31 పూర్తి వివరాలను వ్రాసి సమర్పించవచ్చు.   

ముఖ్య గమనిక :మీరు మీ (బ్యాంకు) వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేసే ముందు వివరాలు సరైనవేనని పూర్తిగా నిర్ధారించుకున్న తరువాతే ముందుకు వెళ్ళండి.  ఎందుకంటే, మీ బ్యాంకు వివరాలు తప్పుగా ఎంటర్ చేస్తే మీ డబ్బు ఆ అకౌంటుకు వెళుతుంది.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo