Flipkart deal: గూగుల్ పిక్సెల్ 6a పైన 11 వేల రూపాయల భారీ డిస్కౌంట్ అందుకోండి.!
గూగుల్ పిక్సెల్ 6a పైన 11 వేల రూపాయల భారీ డిస్కౌంట్ అందుకోండి
రేటు కారణంగా ఇప్పటి ఈ ఫోన్ కొనలేక పోయిన వారికి ఇది నిజంగా పండుగ లాంటి వార్తే
పిక్సెల్ 6a పవర్ ఫుల్ ప్రాసెసర్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటుంది
Flipkart deal: గూగుల్ పిక్సెల్ 6a పైన 11 వేల రూపాయల భారీ డిస్కౌంట్ అందుకోండి. గూగుల్ ఇటీవల ఇండియాలో భారీ ఫీచర్లతో లాంచ్ చేసిన గూగుల్ పిక్సెల్ 6a పైన ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ నే అఫర్ చేస్తోంది. గూగుల్ పిక్సెల్ భారీ కెమెరా ఫీచర్లతో పాటుగా ప్రీమియం డిజైన్ మరియు పవర్ ఫుల్ ప్రాసెసర్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. రేటు కారణంగా ఇప్పటి ఈ ఫోన్ కొనలేక పోయిన వారికి ఇది నిజంగా పండుగ లాంటి వార్తే అవుతుంది. మరి గూగుల్ పిక్సెల్ 6a పైన ఫ్లిప్ కార్ట్ అఫర్ చేస్తున్న అన్ని డీల్స్ మరియు ఆఫర్లను తెలుసుకుందామా.
SurveyGoogle Pixel 6a: ధర మరియు ఆఫర్లు
గూగుల్ పిక్సెల్ 6a ఇండియాలో ముందుగా రూ.43,999 ధరతో ఫ్లిప్‌కార్ట్ నుండి లాంచ్ చేయబడింది. ఈ ఫోన్ ను ప్రస్తుతం 9,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.34,999 అఫర్ ధరకే సేల్ చేస్తోంది. అదనంగా, అన్ని ప్రధాన బ్యాంక్స్ యొక్క క్రెడిట్/డెబిట్ కార్డ్ ల పైన 2,000 అదనపు డిస్కౌంట్ ను కూడా అఫర్ చేస్తోంది. అంటే, మీ బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించి ఈ ఫోన్ ను కోగోలు చేస్తే 2,000 రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు. అంటే, గూగుల్ పిక్సెల్ 6a పైన 11 వేల రూపాయల భారీ డిస్కౌంట్ అందుకోవచ్చు.
Google Pixel 6a: స్పెక్స్
గూగుల్ పిక్సెల్ 6ఎ స్మార్ట్ ఫోన్ 6.14-అంగుళాల FHD + (2340 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు ఇది OLED ప్యానెల్. ఈ డిస్ప్లే ఎగువ మధ్యలో పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంది. పిక్సెల్ 6 ఎ స్మార్ట్ ఫోన్ Google టెన్సర్ యొక్క శక్తితో నడుస్తుంది. ఇఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జత చేయబడింది.
గూగుల్ పిక్సెల్ 4 ఎ, డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 12.2 MP డ్యూయల్ పిక్సెల్ వైడ్ కెమెరా మరియు 12MP అల్ట్రా వైడ్ కెమెరాలతో వస్తుంది. ఈ కెమెరాలు OIS మరియు EIS లకు కూడా సపోర్ట్ కలిగి ఉంటాయి. పిక్సెల్ 6 ఎ యొక్క కెమెరా Live HDR+, సినీమ్యాటిక్ పాన్, డ్యూయల్ ఎక్స్ పోజర్ కంట్రోల్స్, వంటి చాలా ఫీచర్లను కలిగి వుంది. ఈ ఫోన్ వెనుక కెమెరాతో 30Kps/60Kps వద్ద 4K, 30/60fps వద్ద 1080p మరియు 240fps వరకు 720p రికార్డ్ చేయగలదు. ఇందులో 8MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి వుంది.
Pixel 6 a ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,410 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి వుంది. అలాగే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు IP67 వాటర్ ప్రొటక్షన్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile