ధమాకా ఆఫర్లతో వస్తున్న Flipkart Big Billion days 2022 సేల్.!

ధమాకా ఆఫర్లతో వస్తున్న Flipkart Big Billion days 2022 సేల్.!
HIGHLIGHTS

Flipkart Big Billion days 2022 sale ను ధమాకా ఆఫర్లతో తీసుకువస్తునట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది

ఈ సేల్ నుండి గొప్ప డీల్స్ అఫర్ చేయనున్నట్లు ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది

ఈ సేల్ నుండి లేటెస్ట్ మొబైల్ లను మంచి డిస్కౌంట్ ధరకే పొందే వీలుంటుందని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ ద్వారా తెలుస్తోంది

Flipkart Big Billion days 2022 sale ను ధమాకా ఆఫర్లతో తీసుకువస్తునట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఈ సేల్ నుండి మొబైల్స్, టీవీలు, ఎలక్ట్రానిక్స్ మరియు హోమ్ అప్లయన్సెస్ పైన గొప్ప డీల్స్ అఫర్ చేయనున్నట్లు ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ 'సెప్టెంబర్ 23 నుండి సెప్టెంబర్ 30' వరకూ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ సేల్ ను Axis మరియు ICICI భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది కాబట్టి, ఈ రెండు బ్యాంక్ కార్డ్స్ ద్వారా షాపింగ్ చేసే వారికీ వస్తువుల పైన 10% అదనపు డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. మరి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్ నుండి ఏ ప్రోడక్ట్స్ పైన ఎటువంటి అఫర్ లను ఆశించవచ్చనో తెలుసుకుందామా.             

Flipkart అప్ కమింగ్ సేల్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి ఏ కేటగిరి ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా ఎంత వరకూ డిస్కౌంట్ అఫర్ చెయ్యనున్నది, అనే విషయాన్ని ఫ్లిప్ కార్ట్ మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది. దీని ప్రకారం, TV లు మరియు గృహోపకరణాల (హోమ్ అప్లయన్సెస్) పైన గరిష్టంగా 80% వరకు డిస్కౌంట్ అందించే అవకాశం వుంది. అలాగే, ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీస్ పైన కూడా గరిష్టంగా 80% వరకూ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు చెబుతోంది. మొబైల్ ఫోన్ల పైన కూడా గొప్ప ఆఫర్లను మరియు డీల్స్ ను కూడా ప్రకటించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ చెబుతోంది. అంటే, ఈ సేల్ నుండి లేటెస్ట్ మొబైల్ లను మంచి డిస్కౌంట్ ధరకే పొందే వీలుంటుందని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ ద్వారా తెలుస్తోంది.

అలాగే, ఎప్పటిలాగానే స్పెషల్ లాంచ్, క్రేజీ డీల్స్ మరియు రష్ అవర్ వంటి స్పెషల్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఈ సేల్ ని Axis మరియు ICICI యొక్క భాగస్వామ్యంతో తీసుకొస్తోంది కాబట్టి, ఈ రెండు బ్యాంక్స్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా వస్తువులను కొనేవారికి అధనపు తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. అదేవిధంగా, ఫ్లిప్ కార్ట్ పే లేటర్, ఇన్స్టాంట్ క్రెడిట్ మరియు సులభమైన ఈజీ EMI అప్షన్ ను కూడా అఫర్ చేస్తోంది . 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo