ఫ్లిప్‌కార్ట్ కొత్త సంవత్సరంలో బిగ్ సేల్ ను తీసుకువస్తోంది. అదే, Flipkart Big Saving Days Sale మరియు ఈ సేల్ నుండి భారీ ఆఫర్లను తీసుకువస్తోంది. ఈ సేల్ జనవరి 17 వ తేదీ నుండి జనవరి 22 వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీస్ పైన 80% వరకూ భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు టీజింగ్ చేస్తోంది. ఈ సేల్ నుండి మొబైల్స్, టీవీలతో సహా అనేక ప్రోడక్ట్స్ పైన బెస్ట్ డీల్స్ మరియు మరిన్ని ఆఫర్లు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Survey
✅ Thank you for completing the survey!
2022 ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ICICI బ్యాంక్ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. అందుకే, ICICI క్రెడిట్ కార్డ్స్ తో వస్తువులను కొనుగోలుచేసే కొనుగులుదారులకు 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సేల్ నుండి నుండి అందించనున్న డీల్స్ గురించి ఇప్పటికే చేస్తున్న టీజింగ్ పరంగా, టీవీల 75% వరకూ భారీ డిస్కౌంట్ ను అఫర్ చేయనున్నట్లు ప్రకటించింది.
ఇక కొనుగోలు దారులు ఎక్కువగా లాభాలను అందుకునే ఆఫర్ల గురించి చూస్తే, స్మార్ట్ ఫోన్స్, అప్లయన్సెస్ మరియు ఫ్యాషన్స్ పైన మంచి డిస్కౌంట్ అఫర్ చేయబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ఈ డీల్స్ కాకుండా క్రేజీ డీల్స్, రష్ అవర్స్, tick tock డీల్స్ మరియు మరిన్ని ఆఫర్లను కూడా అందించనున్నట్లు వెల్లడించింది.