Flipkart Big Diwali Sale వస్తోంది…భారీ ఆఫర్లు తెస్తోంది..!

HIGHLIGHTS

Flipkart The Big Billion Days

భారీ డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్

అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 23 వరకూ అందుబాటులో ఉంటుంది

ఈ నెలలో Flipkart యొక్క మరొక పండుగ సేల్ వచ్చేస్తోంది. రెండురోజుల క్రితమే Flipkart The Big Billion Days సేల్ ముగిసింది. అయితే, Flipkart వెంటనే  తన దివాళీ సేల్ ను కూడా ప్రకటించింది.  ఈ సేల్ నుండి భారీ డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ మరియు మరిన్ని భారీ ఆఫర్లను తీసుకువస్తోంది. ఇప్పటికే Flipkart తన గత సేల్ నుండి భారీ డీల్స్ తీసుకువచింది మరియు రానున్న దివాళీ సేల్ నుండి కూడా బిగ్ డీల్స్ అందిస్తుందని ఇప్పటి నుండే టీజింగ్ మొదలుపెట్టింది. Flipkart Big Diwali సేల్ అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 23 వరకూ అందుబాటులో ఉంటుంది.

ఈ సేల్ ద్వారా ఇవ్వనున్న ఆఫర్ల విషయానికి వస్తే, Flipakrt ప్రస్తుతం చేస్తున్న టీజింగ్ పరిశీలిస్తే, మొబైల్స్ మరియు ట్యాబ్ లెట్స్ పైన గరిష్టంగా 80 డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు టీజింగ్ చేస్తోంది. ఇక TV లు మరియు గృహోపకరణాల (హోమ్ అప్లయన్సెస్) విషయానికి వస్తే, వీటిపైన కూడా గరిష్టంగా 75% వరకు డిస్కౌంట్ అందించే అవకాశం వుంది చెబుతోంది. ఈ దివాళీ సేల్ ను SBI భాగస్వాయ్యంతో నిర్వహిస్తోంది కాబట్టి SBI కార్డ్స్ మరియు EMI అప్షన్ పైన 10% అధనపు డిస్కౌంట్ అఫర్ కూడా వర్తింప చేసింది.  

అలాగే, ఎప్పటిలాగానే స్పెషల్ లాంచ్, క్రేజీ డీల్స్ మరియు రష్ అవర్ వంటి స్పెషల్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఈ సేల్ నుండి బట్టలు, బూట్లు మరియు మరిన్ని ఫ్యాషన్ వస్తువుల పైన కూడా భారీగానే డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు కూడా టీజింగ్ మొదలు పెట్టింది. దీపావళి సందర్భంగా ప్రకటించిన ఈ సేల్ మరిన్ని డీల్స్ ప్రకటించే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :