కరోనా ఎఫెక్ట్ : మీ EPF నుండి 75 శాతం అడ్వాన్స్ తీసుకునేందుకు వెసులుబాటు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 03 Apr 2020
HIGHLIGHTS
  • మీరు ప్రావిడెంట్ ఫండ్ (PF) రూపంలో సేవ్ చేసిన డబ్బే మీకు ఉపయోగపడుతుంది

కరోనా ఎఫెక్ట్ : మీ EPF నుండి 75 శాతం అడ్వాన్స్ తీసుకునేందుకు వెసులుబాటు
కరోనా ఎఫెక్ట్ : మీ EPF నుండి 75 శాతం అడ్వాన్స్ తీసుకునేందుకు వెసులుబాటు

కరోనా (COVID 19) మహమ్మారి ఇప్పుడు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా, భారత దేశంలో కొనసాగుతున్న 21 రోజుల లాక్ డౌన్ చాలా మందికి ఆర్ధిక అసమానతకి కూడా కారణం అయ్యుండవచ్చు. అయితే, ప్రభుత్వం ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా  ముందు నుండే చర్యలను తీసుకుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

 ఇందులో భాగంగానే, ఉద్యోగస్తులు ఈ కరోనా మహమ్మారి కారణంగా ఎటువంటి ఆర్ధిక ఇబందులను ఎదుర్కోకుండా ఉండేందుకు గాను EPFO అడ్వాన్స్ రూపంలో 75 శాతం వరకూ  డబ్బును తీసుకుందుకు వీలు కల్పించింది.  మీకు అత్యవసర పరిస్థితి కలిగి డబ్బు దొరకడం కష్టంగా ఉన్న సమయాల్లో, మీరు ప్రావిడెంట్ ఫండ్ (PF) రూపంలో సేవ్ చేసిన డబ్బే మీకు ఉపయోగపడుతుంది

. వాస్తవానికి, ముందునుండే  ఉద్యోగస్తులు కొన్ని అనివార్య పరిస్తుతుల్లో తమ PF నుండి కొంత మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో తీసుకునే అవకాశాన్ని అందించింది. అందులో,ముఖ్యంగా, వైద్య సహాయం, పెళ్లి కోసం, ఇల్లు కట్టుకోవడానికి లేదా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, సొంత ఇంటి లోన్ తిరిగి చెల్లించడానికి, చదువు కోసం, వంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఉద్యోగి తన EPF నుండి అడ్వాన్స్ కోసం అభ్యర్ధన చేసుకోవచ్చు. కానీ, ఇందులో కొత్తగా COVID 19 మహమ్మారి అడ్వాన్స్ ని కూడా జతచేసింది.

దీనిని ఎలాగా చేయాలో చూద్దాం.           

ముందుగా EPFO యొక్క అధికారక వెబ్సైట్ లోకి ప్రవేశించి, మీ యొక్క UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ని యాక్టీవేట్ చేసుకోవాలి( ఇప్పటి వరకు చేయనివారికోసం). వెబ్సైట్ కోసం EPFO  పైన క్లిక్ చేయండి.    

EPF నుండి అడ్వాన్స్ కోసం ఎదురుస్తున్నవారు, వారి అభ్యర్థనను ఆన్లైన్లో EPFO వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చు. మీ UAN మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబరుతో ఇక్కడ  మేము సూచించిన విధంగా చేయండి.

1. మొదట మీరు www.epfindia.gov.in వెబ్సైటుకు వెళ్లి ఇక్కడ చూపిన విధంగా క్లిక్ చేయండి .

2.  తర్వాత మీరు UAN / ఆన్లైన్ సర్వీస్ (OCS / OTP) యొక్క సభ్యునికి దాని సర్వీసు పేజీకి మళ్ళించబడతారు.

3. సర్వీసుల కింద సభ్యుని UAN / ఆన్లైన్ సర్వీస్ (OCS / OTP) పై క్లిక్ చేసిన తర్వాత మీరు మీ UAN మరియు పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన పట్టికలో టైప్ చేయండి.

4. మీ UAN మరియు పాస్ వర్డు టైప్ చేసి  ఎంటర్ చేసిన తర్వాత, మీరు Manage పైన నొక్కండి. ఆ తర్వాత దానిలో కనిపించే 4 విభాగాలలో KYC పైన క్లిక్ చేయండి.

5. ఈ KYC లో మీ యొక్క ఆధార్, PAN మరియు బ్యాంకు వివరాలను నమోదుచేసి ఎంటర్ చేయండి. (ఈ వివరాలను ఇప్పటి వరకు నమోదు చేయని వారికోసం) ఇవి మీకు అప్డేట్ అవడానికి కొంత సమయం పడుతుంది.

6. ఇప్పుడు పైన కనిపించే, Online Services పైన నొక్కడం ద్వారా లోనికి ప్రవేశించి, అందులోని Claim ఎంచుకోండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ యొక్క చివరి 4 అంకెలను నమోదు చేసి ఎంటర్ చేయండి.

7.  ఇక్కడ మీ వివరాలతో పాటుగా 'I  Want To Apply For' అని కనిపిస్తుంది. ఇందులోకి వెళ్లి PF Advance (Form-31) ఎంచుకొని మీరు ఎటువంటి అవసరం కోసం మీరు  మీ PF నుండి అడ్వాన్స్ కోసం అప్ప్లై చేస్తున్నారో ఎంచుకొవాల్సివుంటుంది. మీరు కరోనా మహమ్మారి కారణంగా అడ్వాన్స్ కోసం అప్లై చేస్తున్నట్లయితే, ఇందులో "Out Break Of Pandemic" ని ఎంచుకోవాల్సి ఉంటుంది.    

8. ఇక్కడ మీ పూర్తి చిరునామా నమోదు  చేయాలి 

9 తరువాత పాస్ బుక్ జిరాక్స్ లేదా చెక్ బుక్ కాపీ ఫైలును క్రింద జతచేసి  సబ్మిట్ చేయాలి.

9. ఆన్లైన్ అవకాశం లేనివారు EPF ఆఫీసునందు Form - 31 పూర్తి వివరాలను వ్రాసి సమర్పించవచ్చు.

ముఖ్య గమనిక :మీరు మీ (బ్యాంకు) వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేసే ముందు వివరాలు సరైనవేనని పూర్తిగా నిర్ధారించుకున్న తరువాతే ముందుకు వెళ్ళండి.  ఎందుకంటే, మీ బ్యాంకు వివరాలు తప్పుగా ఎంటర్ చేస్తే మీ డబ్బు ఆ అకౌంటుకు వెళుతుంది.

ముఖ్యమైన అభ్యర్ధన : మీరు అత్యవసర సమయంలో ఉన్నప్పుడు, మీకు ఎటువంటి దారిలేనప్పుడు మరియు తప్పని పరిస్థితుల్లో తప్ప, మీ PF అడ్వాన్స్ ని వాడుకోకండి. ఎందుకంటే, ఇది మీకు మీ రిటైర్మెంట్ తరువాత ఉపయోగపడే ఒకే ఒక ఆధారం.          

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Tags:
epfo covid 19
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status