EPFO 3.0: మరింత వేగవంతమైన సేవల కోసం కొత్త సర్వీస్.. UPI తో కూడా విత్ డ్రా అవకాశం.!

Updated on 29-Aug-2025
HIGHLIGHTS

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థ ఎంప్లాయిస్ కోసం కొత్త అప్డేట్ తీసుకొస్తోంది

వేగవంతమైన సేవలు అందించడానికి ఈ కొత్త అప్డేట్ ను తీసుకురావడానికి పని చేస్తోంది

PF అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేయడం చాలా సులభం అవుతుంది

EPFO 3.0: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థ ఎంప్లాయిస్ కోసం కొత్త అప్డేట్ తీసుకొస్తోంది. ఎంప్లాయిస్ కి మరింత సురక్షితమైన మరియు వేగవంతమైన సేవలు అందించడానికి ఈ కొత్త అప్డేట్ ను తీసుకురావడానికి పని చేస్తోంది. అదే, ఈపిఎఫ్ 3.0 కొత్త అప్డేట్ మరియు ఇది త్వరలోనే వస్తుందని కొత్త నివేదికలు చెబుతున్నాయి.

EPFO 3.0: ఎప్పుడు వస్తుంది?

ఎంప్లాయిస్ కు మరింత వేగవంతమైన సేవలు అందించడానికి వీలుగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థ వేగవంతమైన సర్వీసులతో కూడిన కొత్త అప్డేట్ ని అందించడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్త సర్వీసుల కోసం టిసిఎస్, విప్రో మరియు ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ టెక్ సంస్థలను కూడా ఎంపిక చేసింది. ఈ సంస్థలు కొత్త మరియు వేగవంతమైన సర్వీస్ లు అందించడానికి దోహదం చేస్తాయి.

వాస్తవానికి, రెండు నెలల క్రితమే ఈ సర్వీసులు అందుబాటులోకి రావాల్సి ఉండగా, కొన్ని టెక్ సమస్యల కారణంగా ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు వచ్చిన ఒక కొత్త నివేదిక ద్వారా ఈ పనులు చివరి దశకు చేరుకున్నట్లు మరియు త్వరలోనే ఈ కొత్త అప్డేట్ రిలీజ్ అవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం లేదా ఈపీఎఫ్ అధికారిక ప్రకటన తర్వాత ఇది క్లియర్ అవుతుంది.

కొత్త అప్డేట్ తో ఎలాంటి సర్వీస్ లు అందుతాయి?

కొత్త అప్డేట్ తో వేగవంతమైన కొత్త సర్వీసులు అందుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా PF అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేయడం చాలా సులభం అవుతుంది. ఎందుకంటే, కొత్త అప్డేట్ తో యూపీఐ ద్వారా పేమెంట్ నేరుగా చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇదే కాదు ATM ద్వారా కూడా అమౌంట్ ను అకౌంట్ నుంచి ఉపసంహరించుకోవచ్చు. ఇలా చేయడానికి ఎంప్లాయిస్ Aadhaar – UAN తో బ్యాంక్ అకౌంట్ ను లింక్ చేసి ఉండాలి గుర్తుంచుకోండి.

అలాగే, క్లెయిమ్స్ మరియు వ్యక్తిగత వివరాల సవరణ (పేరు, చిరునామా, మొదలైనవి) వంటి వాటి కోసం ఎదురు చూసే పని లేకుండా కేవలం OTP ద్వారా సరి చేసుకోవచ్చు. అంతేకాదు, డెత్ క్లెయిమ్ కోసం గార్డియన్ సర్టిఫికెట్ అవసరం ఉండదు.

Also Read: Moto Buds BASS బడ్స్ ని Dolby Atmos తో చవక ధరలో లాంచ్ చేసిన మోటోరోలా.!

త్వరలో రానున్న అప్డేట్ ప్రస్తుతం ఈపీఎఫ్ అవలంభిస్తున్న పలు విధానాలకు డిజిటల్ అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పటికే దేశంలో అనేక డిజిటల్ సేవలు అందించిన ప్రభుత్వం, ఇప్పుడు ఈపీఎఫ్ విభాగంలో కూడా ఇదే పద్దతి కోసం ఈ చర్యలు చేపట్టింది. ఈ కొత్త అప్డేట్ అమల్లోకి వస్తే, దేశవ్యాప్తంగా ఉన్న ఎంప్లాయిస్ కి ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :