EPF గుడ్ న్యూస్!! చిన్న మెసేజితో సమస్య పరిష్కారం!

HIGHLIGHTS

EPF గుడ్ న్యూస్

EPFO యొక్క వాట్స్అప్ హెల్ప్ లైన్ సేవ

తెలుగు రాష్ట్రాల EPF వాట్స్అప్ హెల్ప్ లైన్ నంబర్

EPFO ఇప్పుడు తన కొత్త సర్వీస్ ను ప్రకటించింది. ఇప్పటి వరకూ, ఎంప్లాయిస్ తమ EPF అకౌంట్ కి సంబంధించి వచ్చిన సమస్యను పరిష్కరించుకోవడానికి కోసం ఆఫీస్ వెదుక్కుంటూ వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు అటువంటి అవసరం లేకుండా కేవలం ఒక చిన్న మెసేజితో ఎంప్లాయిస్ సమస్యల్ని పరిష్కరించేలా చెయ్యడానికి EPFO యొక్క వాట్స్అప్ హెల్ప్ లైన్ సేవలను ప్రకటించింది.

EPFO యొక్క వాట్స్అప్ హెల్ప్ లైన్ సర్వీస్ ద్వారా ఎంప్లాయిస్ ఇంటి నుండే తమ సమస్యలకు పరిష్కారాలను పొందవచ్చని EPFO పేర్కొంది. అంతేకాదు, ఈ EPF వాట్స్అప్ హెల్ప్ లైన్ సర్వీస్ యొక్క దేశంలోని ప్రతి జోన్ లో ఉన్న అన్ని EPF ఆఫీస్ ల వాట్స్అప్ నంబర్లతో వున్న PDF ఫైల్ ను కూడా షేర్ చేసింది. కాబట్టి, ఎంప్లాయిస్ తమ జోన్ మరియు PF నంబర్ యొక్క EPF ఆఫీస్ పరిధి నంబర్ తో తమ సమస్యలకు వివరించి తగిన పరిష్కారాన్ని పొందవచ్చు.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ క్రింద ఇచ్చిన EPF వాట్స్అప్ హెల్ప్ లైన్ నంబర్ లలో సంప్రదించవచ్చు.

ఆంధ్రప్రదేశ్ (విజయవాడ జోన్)

Guntur          –      0863-2344123

Kadapa        –       9491138297

Rajamundry –       9494633563

Vishakhapatnam -7382396602

తెలంగాణా (హైదరాబాద్ జోన్)

Hyderabad (Barkatpura) – 9100026170

Hyderabad (Madhapur) – 9100026146

Karimnagar – 9492429685

Kukatpally –   9392369549

Nizamabad – 8919090653

Patancheru – 9494182174

Siddipet  –     9603262989

Warangal   –  8702447772 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :