elon musks social media plat form X Down and users facing issues on feed and login
X Down : ప్రపంచ అపర కుబేరుడు ఎలా మస్క్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) డౌన్ అయినట్లు యూజర్లు చెబుతున్నారు. నిజానికి చెప్పడం కాదు ప్రముఖ అవుటేజ్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ Downdetector ద్వారా రిపోర్ట్ చేస్తున్నారు. వాస్తవానికి, నిన్న సాయంత్రం కూడా ఎక్స్ ప్లాట్ ఫామ్ డౌన్ అయినట్లు యూజర్లు రిపోర్ట్ చేశారు. ఈరోజు ఉదయం కూడా మరోసారి డౌన్ అయినట్లు రిపోర్ట్ చేయడం గమనార్హం.
ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) సర్వీస్ డౌన్ సమస్యకు గల ఖచ్చితమైన కారణం పై అధికారిక ప్రకటన కోసం యూజర్లు ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి కంపెనీ లేదా ప్రతినిధి నుంచి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు.
అయితే, ఫీడ్ లోడ్ కాకపోవడం, పోస్టులు కనిపించకపోవడం, లాగిన్ సమస్యలు మరియు టైమ్ లైన్ రిఫ్రెష్ కాకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వినియోగదారులు పేర్కొన్నారు. గతంలో కూడా ఎక్స్ ప్లాట్ ఫామ్ లో ఇలాంటి అంతరాయాలు కలిగిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే, ఇండియాలో ఈ సమస్య తీవ్రత అంత ఎక్కువ లేనట్లు డౌన్ డిటెక్టర్ లో నమోదైన రిపోర్ట్ లిస్ట్ సూచిస్తోంది.
Also Read: OnePlus Nord Buds 4 బిగ్ టైటానియం స్పీకర్లు మరియు లాంగ్ బ్యాటరీతో లాంచ్ అవుతోంది.!
ఇక డౌన్ డిటెక్టర్ ప్రకారం, ఇండియాలో ఎక్స్ ప్లాట్ ఫామ్ యాప్ లో 48%, ఫీడ్ / టైం లైన్ లో 25% మరియు వెబ్సైట్ లో 15% సమస్య చూసినట్లు యూజర్లు కంప్లైంట్ చేశారు. అయితే, హాట్ టాపిక్ లేదా ట్రెండ్ ను ముందుగా పోస్ట్ చేసే ప్లాట్ ఫామ్ డౌన్ కావడం నిరుత్సాహం కలిగిస్తుందని కొందరు యూజర్లు వాపోతున్నారు.
ప్రస్తుతం ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) సర్వీస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా కొనసాగుతున్నట్లు యూజర్లు మరియు రిపోర్ట్స్ కూడా చెబుతున్నాయి. అయితే, సర్వీస్ డౌన్ కు దారి తీసిన సమస్య గురించి కంపెనీ నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోవడం కొసమెరుపు.