మనకు సంబంధించిన కాంటాక్ట్స్ నుండి మొదలుకొని ఫోటోలు మరియు బ్యాంక్ డేటా అత్యంత సున్నితమైన పర్సనల్ డేటాతో సహ అన్నింటిని స్టోర్ చేసే ఏకైక స్థానంగా స్మార్ట్ ఫోన్ మారిపోయింది. కాబట్టి, స్మార్ట్ ఫోన్ మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన లేదా దాచుకోవాల్సిన వస్తువుగా మారింది.
అటువంటి ఈ స్మార్ట్ ఫోన్ అనుకోకుండా ఎక్కడైనా పోగొట్టుకున్న లేక దొంగిలించబడినా మీరు పడే భాధ వర్ణనాతీతం. అందుకే, అటువంటి సమయంలో మీరు కంగారు పడకుండా ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కడుందో అతి సులువుగా కొనుగొనేందుకు ఉపయోగపడే మంచి విషయాన్ని ఈరోజు వివరించనున్నాము.
అయితే, Android స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వినియోగదారులు అనుకోకుండా తమ స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా ఏమిచేయాలో ఇక్కడ చూద్దాం…
Find My Device అనేది Android- ఆధారిత పరికరాల కోసం Google అందించే ఒక ఫీచర్. ఇది అనుకోకుండా మర్చిపోయిన లేదా పోగొట్టుకున్న వారి ఫోన్లు, టాబ్లెట్ లేదా వేరబుల్స్ వస్తువులను ట్రాక్ చేయడానికి మరియు కనుగొనడానికి వినియోగదారులకు సహాయపడుతుంది. ప్రతి Android స్మార్ట్ఫోన్తో ఈ సేవ అందించబడుతుంది మరియు మీరు Google ఖాతాతో సైన్ ఇన్ చేసి ఉంటే, Find My Device ఆటొమ్యాటిగ్గా ప్రారంభించబడుతుంది.
Find My Device సర్వీస్ అనేది మీ ఫోన్ను సురక్షితంగా ఉంచడానికి, సైలెంట్ మోడ్లో కూడా సమీపంలో ఉన్నవారిని అప్రమత్తం చేయడానికి సౌండ్ ప్లే చేస్తుంది మరియు మీ ప్రైవేట్ డేటాను సురక్షితంగా ఉంచడానికి చివరి సహాయంగా స్మార్ట్ ఫోన్ లేదా డివైజ్ ని ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి ఒక ఎంపికను అందిస్తుంది. ఒకవేళ మీరు మీ Android ఫోన్ను కోల్పోయినట్లయితే, ఫోన్ను ట్రాక్ చేయడానికి మరియు దాని ఆచూకీ తెలుసుకోవడానికి ఈ క్రింది దశలు మీకు సహాయపడతాయి.
ఇక చివరి అవకాశంగా, పోగొట్టుకున్న ఫోన్ను రక్షించడం చాలా కష్టంగా ఉన్న సందర్భాల్లో, మీ ఫోన్ లో వున్న విలువైన డేటా డిలీట్ చేసే ఎంపిక ద్వారా ఉన్న మొత్తం డేటాను తొలిగించవచ్చు.