సార్వత్రిక ఎలక్షన్స్ 2019 : ఓటరు కార్డు లేకున్నా సరే కొన్ని ఇతర ప్రభుత్వ ఆమోదిత ID కార్డును, చూపించి ఓటు వెయ్యవచ్చు .

సార్వత్రిక ఎలక్షన్స్ 2019 : ఓటరు కార్డు లేకున్నా సరే కొన్ని ఇతర ప్రభుత్వ ఆమోదిత ID కార్డును, చూపించి ఓటు వెయ్యవచ్చు .

ఈరోజు జరగనున్న ఎన్నికల కోసం అన్ని రాష్ట్రాలు కూడా సన్నద్ధమవుతున్నాయి. అయితే, అనుకోకుండా జారవిడుచుకున్నవారు లేదా పోగొట్టుకున్నవారు లేదా ఎక్కడో పెట్టి మర్చి పోయిన వారు, ఇలా చాల మంది, ఓటరు కార్డు లేకుండా ఎలా తమ ఓటు వేయాలని తర్జన భర్జన పడుతుంటారు, వారికోసమే ఈ గుడ్ న్యూస్. ఇక విషయానికి వస్తే, ప్రస్తుతం  ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ద్వారా ఓటరు కార్డు లేకున్నా సరే కొన్ని ఇతర ప్రభుత్వ ఆమోదిత ID కార్డును, చూపించి ఓటు వెయ్యవచ్చు .

వాస్తవానికి, ఓటు వేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఓటరుకు అందించినటువంటి ఆమోదిత ఎలెక్ట్రోల్ ఫోటో ఐడెంటిటీ కార్డు(EPIC) అందరికి (Voter ID కార్డుగా సుపరిచితం) అవసరం. ఈ ఓటరు కార్డు లేకుండా ఓటు వేయడానికి పోలింగ్ బూతు లోపలికి అనుమతించరు. కానీ, ఇప్పుడు మీ ఓటరు కార్డు లేకున్నా సరే, ఈ కొత్త నిర్ణయంతో ఈ  క్రింది సూచించిన పత్రాలను చూపించి ఓటు వేయవచ్చు.

ఈ పత్రాలను చూపించి ఓటు వేయవచ్చు

1. ఆధార్ కార్డు

2. PAN కార్డు

3. డ్రైవింగ్ లైసెన్స్

4. బ్యాంకు అకౌంట్/ పోస్ట్ ఆఫీస్ యొక్క ఫోటో కూడిన ఆమోదిత పాస్ బుక్

5. ఫొటో తో కూడిన పెన్షన్ పత్రం

6.  MPs/MLAs/MLCs కోసం ప్రభుత్వం ఇచ్చిన అధికారిక ID కార్డులు

7. NPR లో భాగంగా RGI ఇచ్చిన స్మార్ట్ కార్డు

8. కేంద్ర మరియు రాష్ట్ర ఉద్యోగులు మరియు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగుల యొక్క ఆమోదిత సర్వీస్ ID కార్డు

9.  పాస్ పోర్ట్     

10. కార్మిక మంత్రిత్వ శాఖ పధకం నుండి పొందిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు                                                    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo