Android 11 అప్డేట్ లో ఈ టాప్ 7 ఫీచర్ల గురించి తెలుసా ?

Android 11 అప్డేట్ లో ఈ టాప్ 7 ఫీచర్ల గురించి తెలుసా ?

జూన్ 10 వ తేదికి అధికారికంగా విడుదల చేయబడిన Android 11 Update, దీనికి అనువైన స్మార్ట్ ఫోన్లలో Beta 1 అప్డేట్  అందింది. ఈ అప్డేట్ తో, యూజర్లకు ఆండ్రాయిడ్ ఫోన్ల వాడకం మరింత సౌకర్యవంతంగా మరియు సెక్యూర్ గా చేసినట్లు చెప్పొచ్చు. ఎందుకంటే,ఆండ్రాయిడ్ 11 బీటాలో మెరుగైన వాయిస్ యాక్సెస్, మెరుగైన పనితీరు, స్క్రీన్ రికార్డర్ మరియు మెరుగైన షేర్ మెనూ వంటి ఫీచర్లు ఉంటాయని గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్లో తెలిపింది. అందుకే, ఈ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొచ్చే 7 ప్రత్యేక ఫీచర్లను వివరంగా పరిశీలిద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Android 11 బీటా వెర్షన్ యొక్క క్రొత్త ఫీచర్లను పరిశీలిద్దాం.

Voice Access 

ఫోన్లో టైప్ చేయడానికి బదులుగా గూగుల్ అసిస్టెంట్ను ఉపయోగించడానికి ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. అటువంటి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని, గూగుల్ ఈ ఫీచర్ కోసం కొత్త రూపాన్ని తీసుకువచ్చింది.

కాన్వర్జేషన్

గూగుల్ యొక్క క్రొత్త Conversation Feature ఫోన్ నోటిఫికేషన్లలో ఉపయోగించబడుతుంది. మీరు ఫోన్లో ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్ ఇకనుండి ఫోన్ స్క్రీన్ పైన 'బబుల్' రూపంలో కనిపిస్తుంది. ShortCut చేయడానికి మీరు ఈ ఫీచర్ ను హోమ్ స్క్రీన్లో కూడా చేయవచ్చు.

డివైజ్ కంట్రోల్

ఫోన్ను బాగా కంట్రోల్ చెయ్యడానికి గూగుల్ ఈ ఫీచర్ను ఆండ్రాయిడ్ 11 బీటాలో తీసుకువస్తోంది. ఏదైనా ఫీచర్ ఉపయోగించడాన్ని ఇది వేగవంతం చేస్తుంది.

Bubble

ఈ ఫీచర్ తో, వినియోగదారులు ఫోన్లో మల్టి యాప్స్ తో మల్టీ టాస్కింగ్ మరియు చాటింగ్ చేసే సౌకర్యాన్ని కూడా పొందుతారు.

మీడియా కంట్రోల్

ఈ క్రొత్త ఫీచర్ మీకు మీ ఫోన్పై మరింత కంట్రోల్  ఇస్తుంది. మీ ఫోన్ ద్వారా ఆడియో మరియు వీడియో మార్పిడి చేయడం మరింత సులభం అవుతుంది.

ప్రైవసీ ఫీచర్ అప్డేట్

గూగుల్ కి తన వినియోగదారుల ప్రైవసీ గురించి బాగా తెలుసు, అలాగే ఫోన్పై మరింత నియంత్రణను కూడా ఇస్తుంది. కాబట్టి ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్లో కట్టుదిట్టమైన ప్రైవసీ ఫీచర్స్ ఉంటాయి.

వన్ టైమ్ పర్మిషన్

కెమెరా, మైక్రోఫోన్ వంటి మీ ఫోన్లోని ఏదైనా ఫీచర్ ని వన్ టైమ్ పర్మిషన్ తో కనెక్ట్ చేయవచ్చు.

పర్మిషన్ ఆటో రీసెట్

మీ ఫోన్లో ఉన్న యాప్స్ ఎక్కువ కాలం ఉపయోగించకపోతే, Android 11 అప్డేట్ యాప్ యొక్క ప్రైవసీ అనుమతులు ఆటొమ్యాటిగ్గా రీసెట్ చేయబడతాయి. ఇది వినియోగదారుల అనుమతితో అప్డేట్ చేయబడుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo