మీ ఫోన్లలో ఈ 10 యాప్స్ లో ఏవైనా ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!!

HIGHLIGHTS

ఫోన్ నుండి సమాచారాన్ని రహస్యంగా సేకరిస్తున్నట్లు గుర్తించబడ్డ ఆండ్రాయిడ్ యాప్స్

ఈ యాప్స్ మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉంటే వెంటనే తొలగించడం మంచిది

ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో ఉన్న డజన్ల కొద్ధి యాప్స్ లో హానికరమైన కోడ్

మీ ఫోన్లలో ఈ 10 యాప్స్ లో ఏవైనా ఉంటే వెంటనే డిలీట్ చేయండి. దీనికి కారణం వుంది వినియోగదారుల ఫోన్ నుండి సమాచారాన్ని రహస్యంగా సేకరిస్తున్నట్లు గుర్తించబడ్డ ఒక పది ఆండ్రాయిడ్ యాప్స్ ని గూగుల్ ఇటీవల ప్లే స్టోర్ నుండి తొలగించింది. అందుకే, ఈ పది యాప్స్ లో ఏవైనా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉంటే వెంటనే తొలగించడం మంచిది. ఈ పది యాప్స్ లో కొన్ని 10 మిలియన్ల కంటే ఎక్కువ డౌన్ లోడ్స్, అంటే 1 కోటి కంటే ఎక్కువ డౌన్ లోడ్స్ చెయ్యబడిన యాప్స్ కూడా వున్నాయి.

Google నిషేధించిన యాప్స్ జాబితాలో QR కోడ్ డిటెక్టర్, వాతావరణ విడ్జెట్ మరియు ముస్లిం ప్రార్థన సమయాల కోసం ప్రోగ్రామ్ వంటివి ఉన్నాయి. అనేక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో ఉన్న డజన్ల కొద్ధి యాప్స్ లో ఈ హానికరమైన కోడ్ ఉన్నట్లు సెర్జ్ ఎగెల్‌మాన్ మరియు జోయెల్ రియర్డన్ అనే ఇద్దరు సెక్యూరిటీ మరియు ప్రైవసీ పరిశోధకులు కనుగొన్నారు.

ఈ కోడ్స్ ద్వారా వినియోగదారు యొక్క ఖచ్చితమైన స్థానం, వారి ఇమెయిల్, ఫోన్ నంబర్స్, సమీపంలోని కంప్యూటర్‌లు మరియు మొబైల్ పరికరాల డేటా, పాస్‌వర్డ్‌ లతో సహా క్లిప్‌బోర్డ్ డేటా, అలాగే Android ఫైల్ సిస్టమ్, ముఖ్యంగా WhatsApp డౌన్‌లోడ్ ఫోల్డర్ వంటి వ్యక్తిగత ఐడెంటి ఫైయర్‌ లను సేకరించగలరు.

అందుకే, గూగుల్ ఈ విధమైన కోడ్స్ కలిగినట్టు;గుర్తుచించిన 10 యాప్స్ ను వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించింది. గూగుల్ ప్లే స్టోరు నుండి నిషేధించబడిన ఆ 10 యాప్స్ వివరాలను క్రింద చూడవచ్చు.

1. QR & Barcode Scanner (Developed by AppSource Hub)

2. Speed Radar Camera

3. Wi-Fi Mouse (Remote Control PC)

4. Qibla Compass – Ramadan 2022

5. Simple Weather & Clock Widget (Developed by Difer)

6. Al-Moazin Lite (Prayer times)

7. Handcent Next SMS- Text With MMS

8. Smart kit 360

9. Audiosdroid Audio Studio DAW

10.Full Quran MP3-50 Languages & Translation Audio

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :