ఈ 22 యాప్స్ లో ఏ ఒక్కటి మీ ఫోన్ లో ఉన్నా వెంటనే డిలీట్ చేయండి

ఈ 22 యాప్స్ లో ఏ ఒక్కటి మీ ఫోన్ లో ఉన్నా వెంటనే డిలీట్ చేయండి
HIGHLIGHTS

మీ బ్యాంక్ అకౌంట్ తో సహా పర్సనల్ డేటా ప్రమాదంలో ఉన్నట్లే

ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలేట్ చేయండి

ఈ యాప్స్ SMS నుండి OTP లను కూడా యాక్సెస్ చేయగలవు

ఈ 22 యాప్స్ లో ఏ ఒక్కటి మీ ఫోన్ లో ఉన్నా వెంటనే డిలీట్ చేయండి. ఎందుకంటే, ఇటీవల గూగుల్ ప్లే స్టోర్ నుండి 'ట్రోజన్' జోకర్ మాల్వేర్ బారిన పడిన ఒక 7 యాప్స్ ని గూగుల్ తన ప్లే స్టోర్ నుండి తొలగించగా మరొక 15 యాప్స్ కూడా జోకర్ మాల్వేర్ ని క్యారీ చేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ Kaspersky యొక్క విశ్లేషకుడు తత్యాన సిస్కోవా వెల్లడించించారు. అంటే, ఈ 22 యాప్స్ లో ఏదైనా మీ ఫోన్ లో ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ తో సహా పర్సనల్ డేటా మొత్తం ప్రమాదంలో ఉన్నట్లే. అందుకే, ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలేట్ చేయండి.         

అసలు ఏమిటి ఈ జోకర్ మాల్వేర్?

జోకర్ మాల్వేర్ అనేది మీకు తెలియకుండానే మీ ఫోన్ నుండి ఆన్లైన్ యాడ్స్ మరియు ఆన్లైన్ సర్వీస్ లకు సబ్ స్క్రిప్షన్ ను యాక్సెస్ చేస్తుంది. అంటే, మీకు తెలియకుండానే మీరు తీసుకోని సర్వీస్ లకు మీరు డబ్బు చెల్లిస్తారు. అంటే, ఈ మాల్వేర్ మిమల్ని జోకర్ చేస్తుంది. ఇది ఎంత ప్రమాదకరమైన మాల్వేర్ అంటే, చెల్లింపులను రహస్యంగా ఆమోదించడానికి SMS నుండి OTP లను కూడా యాక్సెస్ చేయగలదు. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను చూసుకునే వరకూ మీకు ఈ విషయం గురించి తెలియదు.

ముందుగా తొలిగించిన 7 యాప్స్

1. Now QRcode Scan

2. EmojiOne Keyboard

3. Battery Charging Animations Battery Wallpaper

4. Dazzling Keyboard

5. Volume Booster Louder Sound Equalizer

6. Super Hero-Effect

7. Classic Emoji Keyboard

లేటెస్ట్ గా జోకర్ మాల్వేర్ భారిన పడిన యాప్స్

8. Easy PDF Scanner

9. Now QRCode Scan

10.Blender Photo Editor-Easy Photo Background Editor 

11. Super-Click VPN

12.Volume Booster Louder Sound Equalizer

13.Battery Charging Animation Bubble Effects

14.Smart TV Remote

15.Volume Boosting Hearing Aid

16.Flashlight Flash Alert on Call

17.Halloween Coloring

18.Classic Emoji Keyboard

19.Super Hero-Effect

20.Dazzling Keyboard

21.Emoji One Keyboard

22.Battery Charging Animation Wallpaper                 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo