Joker Malware: మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేయండి…ఉంటే..!
జోకర్ మాల్వేర్ అనేది చాలా శక్తివంతమైన మాల్వేర్
దాదాపుగా 15 యాప్స్ దీని భారిన పడినట్లు తెలిపారు
మీరు తీసుకోని సర్వీస్ లకు మీరు డబ్బు చెల్లిస్తారు
మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేయండి. ఎందుకంటే, సైబర్ సెక్యూరిటీ సంస్థ Kaspersky యొక్క విశ్లేషకుడు తత్యాన సిస్కోవా గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న కొన్ని యాప్స్ జోకర్ మాల్వేర్ భారిన పడినట్లు కనుగొన్నారు. జోకర్ మాల్వేర్ అనేది చాలా శక్తివంతమైన మాల్వేర్. వాస్తవానికి, గూగుల్ దీన్ని పూర్తిగా తొలగించడానికి తగిన చర్యలు కూడా తీసుకుంది. అయితే, తత్యాన సిస్కోవా లేటెస్ట్ గా జోకర్ మాల్వేర్ గూగుల్ ప్లే స్టోర్ లోకి తిరిగి ప్రవేశించినట్లు, దాదాపుగా 15 యాప్స్ దీని భారిన పడినట్లు తెలిపారు.
Surveyగత సంవత్సరం గూగుల్ ప్లే స్టోర్ నుండి అనేకమైన యాప్స్ పైన జోకర్ మాల్వేర్ అటాక్ చేసింది. దీనిభారీ నుండి వినియోగదారులను రక్షించడానికి గూగుల్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోని ఈ మాల్వేర్ సోకిన అన్ని యాప్స్ ను తొలగించింది. అయితే, ఈ మాల్వేర్ మళ్ళి గూగుల్ ప్లే స్టోర్ లోకి తిరిగి వచ్చినట్లు కనిపిస్తోంది.
అసలు ఏమిటి ఈ జోకర్ మాల్వేర్?
జోకర్ మాల్వేర్ అనేది మీకు తెలియకుండానే మీ ఫోన్ నుండి ఆన్లైన్ యాడ్స్ మరియు ఆన్లైన్ సర్వీస్ లకు సబ్ స్క్రిప్షన్ ను యాక్సెస్ చేస్తుంది. అంటే, మీకు తెలియకుండానే మీరు తీసుకోని సర్వీస్ లకు మీరు డబ్బు చెల్లిస్తారు. అంటే, ఈ మాల్వేర్ మిమల్ని జోకర్ చేస్తుంది. ఇది ఎంత ప్రమాదకరమైన మాల్వేర్ అంటే, చెల్లింపులను రహస్యంగా ఆమోదించడానికి SMS నుండి OTP లను కూడా యాక్సెస్ చేయగలదు. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను చూసుకునే వరకూ మీకు ఈ విషయం గురించి తెలియదు.
లేటెస్ట్ గా జోకర్ మాల్వేర్ భారిన పడిన యాప్స్
Easy PDF Scanner
Now QRCode Scan
Super-Click VPN
Volume Booster Louder Sound Equalizer
Battery Charging Animation Bubble Effects
Smart TV Remote
Volume Boosting Hearing Aid
Flashlight Flash Alert on Call
Halloween Coloring
Classic Emoji Keyboard
Super Hero-Effect
Dazzling Keyboard
Emoji One Keyboard
Battery Charging Animation Wallpaper
Blender Photo Editor-Easy Photo Background Editor
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile