Teachers Day 2026 విషెస్ కోసం వాట్సాప్ స్టేటస్ వీడియోని అదే ఫీచర్ తో క్రియేట్ చేసుకోండి.!

HIGHLIGHTS

Teachers Day 2026 విషెస్ కోసం వాట్సాప్ స్టేటస్ వీడియోని అదే ఫీచర్ తో క్రియేట్ చేసుకోండి

గురువు గారిని పూజించడానికి ‘గురుపూజోత్సవం’ రోజును మించి మంచి అవకాశం మనకు దొరకదు

ఈ గొప్ప పండుగ ఔన్నత్యం మరియు విలువ తెలియజేసే షార్ట్ వీడియో లను స్టేటస్ లో పెట్టుకోండి

Teachers Day 2026 విషెస్ కోసం వాట్సాప్ స్టేటస్ వీడియోని అదే ఫీచర్ తో క్రియేట్ చేసుకోండి. మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు ఎంత ఇచ్చినా, ఏమి చేసినా కూడా అది తక్కువే అవుతుంది. ఎందుకంటే, ఏ స్వార్థం లేకుండా మనలను గొప్ప మార్గంలో నడిపించి మనకు గొప్ప భవిష్యత్తు అందించడానికి శాయశక్తులా ప్రయత్నించే దైవం, గురువు మాత్రమే. అటువంటి గురువు గారిని పూజించడానికి ‘గురుపూజోత్సవం’ రోజును మించి మంచి అవకాశం మనకు దొరకదు. ఈ గొప్ప పండుగ ఔన్నత్యం మరియు విలువ తెలియజేసే షార్ట్ వీడియో లను స్టేటస్ లో పెట్టడం ద్వారా ఈ స్టేటస్ చూసే అందరికీ మరోసారి వారి గురువు గుర్తుకు చేసే అవకాశం ఉంటుంది.

అందుకే, ఆన్లైన్ లో లభించే ఆర్టిఫీషియల్ స్టేటస్ వీడియోలు కాకుండా మీరే సొంతంగా మీ ఫోన్ లో ఉన్న వాట్సాప్ స్టేటస్ ఫీచర్ లోనే ఒక అర్థవంతమైన వీడియో క్రియేట్ చేసుకోవడం బాగా అనిపిస్తుంది. అందుకే, వాట్సాప్ లో ఉన్న ఈ ఉపయోగకరమైన ఫీచర్ తో మీ సొంత వీడియో ఎలా క్రియేట్ చేయాలో సవివరంగా అందించాము.

Teachers Day 2026 విషెస్ ఎలా క్రియేట్ చేయాలి?

మీరు ఈ గురుపూజోత్సవం శుభాకాంక్షలు వీడియో కోసం మీ ఫోన్ లో ఉన్న వాట్సాప్ సహాయం తీసుకోవాలి. క్రియేషన్ కోసం Meta AI మీకు సహాయం చేస్తుంది. డైరెక్ట్ గా వీడియో క్రియేట్ చేయడానికి, ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీ వాట్సాప్ అకౌంట్ స్టేటస్ లోకి వెళ్ళండి. ఇందులో మీ వాట్సాప్ స్టేటస్ పై క్లిక్ చేసి ఇక్కడ చూపించే ఆప్షన్స్ లో ‘వాయిస్’ పక్కన ‘AI images’ ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ మీకు మెటా ఏఐ చాట్ బాట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ Edit Photo ఆప్షన్ ఎంచుకోండి. ఇందులో మీకు నచ్చిన మీ గురువుగారి ఫోటో లేదా మీ స్కూల్ ఇమేజ్ లేదా గురుపూజోత్సవం ఫోటో సెలెక్ట్ చేయండి.

ఈ సెలెక్ట్ చేయగానే క్రింద క్రింద ఎడిట్, రీ స్టైల్ మరియు యానిమేట్ అనే మూడు ఆప్షన్లు వస్తాయి. మీరు ఇచ్చిన ఇమేజ్ ని ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి చాట్ బాక్స్ లో చేయాల్సిన మార్పులు ప్రాంప్ట్ అందిస్తే, మార్పులు చేసి కొత్త ఇమేజ్ అందిస్తుంది. ఈ కొత్త ఇమేజ్ ని యానిమేట్ ఆప్షన్ తో క్లిక్ చేస్తే మీరు అందించిన ఫోటో యానిమేట్ వీడియో గా మారుతుంది.

Also Read: AI Telugu భాషకు వరమా లేక శాపమా ..టెక్నాలజీ మన భాషను ఎలా మార్చేస్తోంది.!

Teachers Day 2026 ఏఐ వీడియో వాట్సాప్ లో

ఒకవేళ మీరు నేరుగా వీడియో క్రియేట్ చేయాలనుకుంటే కూడా వాట్సాప్ లో ఉన్న Meta AI చాట్ బాట్ ని ఓపెన్ చేసి మీకు నచ్చిన కొన్ని ఫోటోలు అప్లోడ్ చేసి వాటిని ఏఐ వీడియో గా క్రియేట్ చేయాలని సూచిస్తే మీకు 5 సెకన్ల నిడివి కలిగిన ఏఐ వీడియో అందిస్తుంది. ఇందులో మీరు అందించే ఇమేజ్ కి ప్రాణం పోస్తుంది. ఈ ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్ లో ఉండే టెక్స్ట్ అండ్ మ్యూజిక్ తో చాలా అందమైన స్టేటస్ ను ఈ గురుపూజోత్సవం రోజు మీ వాట్సాప్ అకౌంట్ లో సెట్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :