IT Jobs బదులుగా గొర్రెల కాపరి ఉద్యోగాలకు అప్లై చేస్తున్న సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్లు.. మారుతున్న టెక్ ట్రెండ్!

HIGHLIGHTS

ఒకప్పుడు IT Jobs అంటే ఐదంకెల జీతం ఫ్యూచర్ సెక్యూరిటీకి ప్రతీకగా భావించేవారు

చైనాలో కొందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు బదులుగా గొర్రెల కాపరి ఉద్యోగాల కోసం ఎగబడుతున్నారు

టెక్ ప్రొఫెషనల్స్ అప్లై చేసిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

IT Jobs బదులుగా గొర్రెల కాపరి ఉద్యోగాలకు అప్లై చేస్తున్న సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్లు.. మారుతున్న టెక్ ట్రెండ్!

ఒకప్పుడు IT Jobs అంటే ఐదంకెల జీతం, ప్రీమియం లైఫ్‌ స్టైల్ మరియు ఫ్యూచర్ సెక్యూరిటీకి ప్రతీకగా భావించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా, చైనాలో కొందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు బదులుగా గొర్రెల కాపరి ఉద్యోగాలకు అప్లై చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ మరియు తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా టెక్ ఉద్యోగాల పై యువత దృక్పథం మారుతోందని నిపుణులు చెబుతున్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

IT Jobs : ఎందుకు వద్దనుకుంటున్నారు?

చైనాలో గత కొన్ని సంవత్సరాలుగా టెక్ రంగంలో భారీగా లే ఆప్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా AI టూల్స్ అభివృద్ధి చెందడంతో కోడింగ్, టెస్టింగ్ మరియు కస్టమర్ సపోర్ట్ వంటి అనేక పనులు ఆటోమేషన్ వైపు మారుతున్నాయి. దీంతో ఎంట్రీ లెవెల్ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని సమాచారం.

మరోవైపు పెద్ద IT కంపెనీల్లో “996 వర్క్ కల్చర్” అంటే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, వారానికి 6 రోజులు పని చేయాల్సిన పరిస్థితులు ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ వర్క్ కల్చర్ చైనా లో ఇప్పటికే అమలులో ఉంది మరియు ఇలా చేస్తే వారానికి 72 గంటల పని గంటలు అవుతాయి. అయితే, మన దేశ కార్పొరేట్ కంపెనీలలో 48 గంటల పని గంటల సమయం నడుస్తోంది. ఇది కొత్తగా కేంద్రం నిర్ణయించిన పని గంటలు.

IT Jobs గొర్రెల కాపరి

ఈ నేపథ్యంలో కొందరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ తక్కువ ఒత్తిడి ఉన్న ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. చైనాలో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెల కాపరి ఉద్యోగం కోసం టెక్ ప్రొఫెషనల్స్ అప్లై చేసిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గొర్రెలు కాయడానికి నెలకు లక్ష రూపాయల జీతంతో ఇచ్చిన ఆన్లైన్ యాడ్ కి 700 మంది ఇంజనీర్స్ అప్లై చేయడం ఐటి జాబ్స్ సమస్య కు అద్దం పడుతోంది. ప్రకృతి మధ్య ప్రశాంత జీవితం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మరియు మానసిక ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పలువురు ఇంజనీర్లు మరియు యువత చెబుతున్నారు.

Also Read: Samsung 4K Smart Tv స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తోంది.!

IT Jobs : ఫ్యూచర్ ఎవరికి ఉంటుంది?

టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, AI రివల్యూషన్ భవిష్యత్తులో ఉద్యోగాల స్వభావాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. రొటీన్ కోడింగ్ పనులు AI టూల్స్ వేగంగా పూర్తి చేయగలుగుతున్నాయి. దీంతో క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, AI మేనేజ్మెంట్ మరియు ఉన్నత స్థాయి రీసర్చ్ స్కిల్స్ ఉన్నవారికి మాత్రమే భవిష్యత్తులో డిమాండ్ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా, యూరప్‌, ఆసియా దేశాల్లో చాలామంది టెక్ ఎంప్లొయీస్ బర్న్అవుట్, జాబ్ ఇన్ సెక్యూరిటీ మరియు లే ఆప్స్ కారణంగా ప్రత్యామ్నాయ ఉద్యోగాల వైపు చూస్తున్నారు. కొందరు వ్యవసాయం, కంటెంట్ క్రియేషన్, ఇంటి వద్ద నుంచే పని చేయడం మరియు సొంత ఊరిలో తక్కువ జీతంతో లభించే జాబ్స్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile