Google Maps లోనే రైళ్ళ లైవ్ రన్నింగ్ స్టేటస్ తెలుసుకోండి.!

Google Maps లోనే రైళ్ళ లైవ్ రన్నింగ్ స్టేటస్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

Google Maps లో ఇన్స్టాంట్ గా రైళ్ళ లైవ్ రన్నింగ్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు

మీరు చేరాకోవాల్సిన ప్రదేశానికి రూట్ మ్యాప్‌ ను కూడా సింపుల్ గా పొందవచ్చు

ఇతర స్టాప్‌లను కూడా గూగుల్ మ్యాప్ లో చూడవచ్చు

Google Maps కేవలం రోడ్ ట్రాఫిక్ మరియు లొకేషన్ ను చూడడానికి మాత్రమే కాదు ఇన్స్టాంట్ గా రైళ్ళ లైవ్ రన్నింగ్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు. అంటే, మీ ఫోన్ లో ఉన్న గూగుల్ మ్యాప్ లో మీకు కావాల్సిన ట్రైన్ స్టేటస్ ను వెంటనే తెలుసుకోవచ్చు. అంతేకాదు, మీరు ఉన్న చోటునుండి మీరు చేరాకోవాల్సిన ప్రదేశానికి రూట్ మ్యాప్‌ ను కూడా సింపుల్ గా పొందవచ్చు. అదనంగా మీకు అందుబాటులో ఉన్న రైలు పేరు, బోర్డింగ్ స్టేషన్ మరియు మార్గంలో వచ్చే ఇతర స్టాప్‌లను కూడా గూగుల్ మ్యాప్ లో చూడవచ్చు. అంతేకాదు, మీ ప్రయాణానికి పట్టే సమయం మరియు Live Train రన్నింగ్ స్టేటస్ ను కూడా గూగుల్ మ్యాప్ అందిస్తుంది.

పైన తెలిపిన అన్ని వివరాలను మీరు పొందాలంటే ముందుగా మీరు మీ ఫోన్ లో గూగుల్ మ్యాప్ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ ను కలిగిఉండాలి. ఈ ఫీచర్ iOS మరియు Android రెండు OS ల కోసం అందుబాటులో వుంది.  

గూగుల్ మ్యాప్ లో Live Train రన్నింగ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

ముందుగా మీ ఫోన్ లో గూగుల్ మ్యాప్ ని తెరవండి

రైల్వే స్టేషన్ లేదా మీరు చేరుకోవాల్సిన డెస్టినేషన్ లొకేషన్ ఎంటర్ చేయండి

మ్యాప్ లో 'టూ-వీలర్' మరియు 'Walk' ఆప్షన్‌ల మధ్య ఉండే 'Train' ఎంపికను ఎంచుకోండి.

మీరు స్టేషన్‌ లకు బదులుగా లొకేషన్ ఉంచినట్లయితే, మ్యాప్ సమయం, దూరం మరియు స్టేషన్‌కు వెళ్లే మార్గాన్ని చూపుతుంది.

ట్రైన్ స్టేటస్ కోసం 'Train' చిహ్నం పైన నొక్కండి

ఇక్కడ కనిపించే ట్రైన్ పేరు పైన నొక్కడం ద్వారా ఆ ట్రైన్ ప్లాట్‌ఫారమ్ నంబర్, ఏ సమయంలో ఆ ప్లాట్‌ఫారమ్‌కు చేరుకుంటుంది వంటి లైవ్ ట్రైన్ వివరాలను చూడవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo