Install App Install App

BSNL సునామి అఫర్: కేవలం రూ.106కే 75 రోజుల వ్యాలిడిటీ హై స్పీడ్ డేటా మరియు కాలింగ్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 06 Dec 2021
HIGHLIGHTS
  • ప్రైవేట్ యాజమాన్య టెలికం కంపెనీలు కూడా వారి ప్లాన్ ధరలను పెంచేశాయి

  • BSNL నామమాత్రపు ధరలకే తన ప్లాన్స్ అఫర్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది

  • జియో వంటి బడా కంపెనీ ప్లాన్స్ కు కూడా BSNL భారీ పోటీగా నిలుస్తోంది

BSNL సునామి అఫర్: కేవలం రూ.106కే 75 రోజుల వ్యాలిడిటీ హై స్పీడ్ డేటా మరియు కాలింగ్
BSNL సునామి అఫర్: కేవలం రూ.106కే 75 రోజుల వ్యాలిడిటీ హై స్పీడ్ డేటా మరియు కాలింగ్

గత నెల నుండి అన్ని ప్రైవేట్ యాజమాన్య టెలికం కంపెనీలు కూడా వారి ప్రీపెయిడ్ ప్లాన్ ధరలను పెంచేశాయి. కాబట్టి, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా మరియు జియో తమ రీఛార్జ్ కోసం ఎక్కువ మొత్తం చెల్లించవలసి వస్తుంది. అయితే, ఊహించని విధంగా ప్రభుత్వ టెలికం కంపెనీ అయిన BSNL మాత్రం కేవలం నామమాత్రపు ధరలకే తన ప్రీపెయిడ్ ప్లాన్స్ ను అఫర్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. BSNL  STV_94 పేరుతో తీసుకొచ్చిన రూ. 106 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ వీటిలో చెప్పుకోదగినది. ఈ ప్లాన్ ఏకంగా జియో వంటి బడా కంపెనీ ప్లాన్స్ కు కూడా భారీ పోటీగా నిలుస్తోంది.

BSNL రూ. 106 రీఛార్జ్ ప్లాన్

BSNL యొక్క రూ. 106 స్పెషల్ టారిఫ్ వోచర్ ఏకంగా 75 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ 100 మినిట్స్ ఉచిత లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. అయితే, ఈ ఉచిత కాలింగ్ మినిట్స్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇక ఈ 100 మినిట్స్ ఉచిత కాలింగ్ లిమిట్ ముగిసిన తరువాత కాలింగ్ కోసం నిముషానికి 30 పైసలు చెల్లించాలి. అధనంగా, ఈ ప్లాన్‌ ద్వారా 60 రోజుల పాటు కాలర్ ట్యూన్ సర్వీస్ ను ఉచితంగా పొందవచ్చు.

ఇక తక్కువ ధరకే ఎక్కువ లాభాలను అందించే మరిన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి. వాటిలో కేవలం 500 రూపాయల కంటే తక్కువ ధరలోనే వచ్చే BSNL బెస్ట్ ప్లాన్స్ ని ఈ క్రింద చూడవచ్చు 

BSNL రూ.199 అన్లిమిటెడ్ ప్లాన్

BSNL యొక్క రూ.199 అన్లిమిటెడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 60GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తి నెల మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది.                     

BSNL రూ.249 అన్లిమిటెడ్ ప్లాన్

BSNL యొక్క రూ.249 అన్లిమిటెడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది.

BSNL రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్

BSNL యొక్క రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్ 10 నెలల (300 రోజులు) వ్యాలిడిటీ తో వస్తుంది మరియు డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ యొక్క ఉచిత లాభాలు కేవలం 60 రోజులకే వర్తిస్తాయి.

BSNL రూ.499 STV ప్లాన్

BSNL యొక్క రూ.499 STV ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 180GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా మూడు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. అదనంగా, ఫ్రీ కాలర్ ట్యూన్ మరియు ఉచిత Zing యాప్ యాక్సెస్ కూడా అందిస్తుంది.

BSNL యొక్క మరిన్ని బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: bsnl latest best plans with huge benefits
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status