Crowdstrike Down: అతిపెద్ద సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఒక్కసారిగా డౌన్ అయ్యింది. కొత్తగా తీసుకు వచ్చిన అప్డేట్ తర్వాత ఈ చర్య జరిగినట్లు తెలిసింది. ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా జరిగింది మరియు ఈ చర్య తర్వాత యూజర్లు సిస్టం నుండి లాగ్ అవుతున్నట్టు కూడా చెబుతున్నారు. క్రౌడ్ స్ట్రైక్ డౌన్ అయిన తర్వాత కొత్త ఎర్రర్ ను వస్తున్నట్టు మరియు సిస్టం నుండి యూజర్స్ లాగవుట్ అవుతున్నట్లు రెడ్ఇట్ సాక్షిగా యూజర్లు తమ గోళ్లు వెళ్లబెడుతున్నారు.
Survey
✅ Thank you for completing the survey!
Crowdstrike Down:
Crowdstrike Down
అతిపెద్ద సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ డౌన్ అవ్వటం వలన యూజర్లు అనేక సమస్యలు చూసినట్టు TipOFMYTONGUEDAMN అనే రెడ్ఇట్ యూజర్ రిపోర్ట్ పోస్ట్ చేశారు. క్రౌడ్ స్ట్రైక్ డౌన్ అవ్వటం వలన BSOD error ను ఫేస్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఎర్రర్ బ్లూ స్క్రీన్ కి దారితీస్తుందని, దీన్ని స్టాప్ ఎర్రర్ గా కూడా పిలుస్తారని మరియు ఇది చాలా క్రిటికల్ ఎర్రర్ అని కూడా నొక్కి చెబుతున్నారు.
ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది యూజర్స్ కి తలెత్తింది. ఈ పోస్ట్ లో ఆస్ట్రేలియా, ఇండియా, మరిన్ని దేశాల యూజర్లు జతకట్టారు. దీని ద్వారా ఈ క్రౌడ్ స్ట్రైక్ సమస్య ఎంత పెద్దదో తెలుస్తోంది. ఇది ప్రధాన ప్రోడక్ట్ అయిన Falcon లో తలెత్తిన టెక్నీకల్ ఇష్యూ దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అయితే, ఈ సమస్యను పరిష్కరించడానికి తమ ఇంజనీర్స్ ప్రయత్నిస్తున్నారని, అతి త్వరలో ఈ సమస్యకు పరిష్కారాన్ని అందిస్తామని కంపెనీ చెబుతున్నట్లు తెలుస్తోంది.