బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ వచ్చేసింది

HIGHLIGHTS

బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ వచ్చేసింది

ఈ గేమ్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుండి అధికారికంగా అందుబాటులో ఉంది

ఈ గేమ్, ఆడటానికి పూర్తిగా PUBG మాదిరిగా ఉంది

బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ వచ్చేసింది

గేమింగ్ ప్రియులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ వచ్చేసింది. ఈ గేమ్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుండి అధికారికంగా అందుబాటులో ఉంది. గత కొన్ని రోజులుగా కేవలం ప్రీ యాక్సెస్ తో మాత్రమే వున్న ఈ గేమ్, ఇప్పుడు అధికారికంగా అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరూ కూడా ఆడగలుగుతారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ గేమ్, ఆడటానికి పూర్తిగా PUBG మాదిరిగా ఉంది. అయితే, ఈ రెండింటి మధ్య సూక్ష్మమైన తేడాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఈ గేమ్ లో బ్లడ్ కలర్ ఎఫెక్ట్ ఉండదు మరియు 'Killed' స్థానంలో 'Defeted' అని వస్తుంది. అంతేకాదు, ఈ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ ను సీరియస్ గా తీసుకోకూడదని ఇది కేవల్కమ్`కేవలం ఒక గేమ్ మాత్రమే అని కూడా చెబుతుంది.

ప్రస్తుతానికి, ఈ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్  కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.  iOS లో ఈ గేమ్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కాబట్టి, iPhone మరియు iPad ప్లేయర్స్ మరికొంత కాలం ఈ గేమ్ ఆడటం కోసం వేచి చూడవలసి వస్తుంది. అయితే, ఈ గేమ్ యొక్క iOS వెర్షన్ ఎప్పుడు ప్రారంభమవుతుందినే విషయాన్ని ఇంకా ప్రకటించ లేదు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo