మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఈ తప్పులు చేస్తున్నారా..!

Updated on 17-Nov-2021
HIGHLIGHTS

యూజర్లు చేసే కామన్ మిస్టేక్స్ చాలా ఉంటాయి

మీ ఫోన్ ను సెక్యూరిటీ పరంగా చిక్కుల్లో పడేయవచ్చు

ఈ తప్పులను గురించి తెలుసుకోవడం మీకు ఉపయోగపడుతుంది

ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించేప్పుడు యూజర్లు చేసే కామన్ మిస్టేక్స్ చాలా ఉంటాయి. అయితే, వాటిలో కొన్ని తప్పులు (మిస్టేక్స్) మీ ఫోన్ ను సెక్యూరిటీ పరంగా చిక్కుల్లో పడేయవచ్చు. ఈ తప్పులను గురించి తెలుసుకోవడం మీకు ఉపయోగపడుతుంది మరియు మీ ఫోన్ ను పరిరక్షికునేందుకు ఉపయోగపడతాయి. అందుకే, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తరచుగా చేసే తప్పుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడింగ్

Google Play Store నుండి కాకుండా మరింకెక్కడి నుండైనా యాప్స్ డౌన్ లోడ్ చేస్తుంటారు. అవే 'థర్డ్ పార్టీ యాప్స్' మరియు వీటిని అవసరాన్ని డౌన్ లోడ్ చేసుకోని ఉపయోగిస్తుంటారు. కానీ, ఇది సాధారణ విషయం మాత్రం కాదు మరియు ఇది తర్వాత మీ ఫోన్‌కు హాని కలిగించవచ్చు. అందుకే, సెట్టింగ్స్ లో ఉన్న యాప్ మెనూలో అన్నోన్ యాప్స్ ఇన్స్టాలేషన్ ఎంపికను ఆఫ్ చేయాలి.

యాప్ డోన్ లోడ్ సమయంలో అజాగ్రత్త

ఒక యాప్ డోన్ లోడ్ సమయంలో మీరు మీ ఫోన్ అనుమతుల పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఎందుకంటే, చాలా యాప్స్ మీ కాంటాక్ట్ లిస్ట్, మెసేజెస్ మరియు స్టోరేజ్ కోసం అనుమతిని కోరతాయి. ఇక్కడ మీరు శ్రద్ద వహించకపోతే నష్టపోతారు.            

ఫోన్ లాక్ కోసం సులభమైన పాస్వర్డ్ ఉంచడం

ముఖ్యంగా, ఫోన్ లాక్ కోసం సులభమైన పాస్వర్డ్ ఉంచడం ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవారు చేసే మోస్ట్ కామన్ మిస్టేక్. ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ అన్లాక్ మీకు సులభంగా మరియు సౌకర్యవంతంగా అనిపించవచ్చు. అయితే, ఫోన్ అన్లాక్ కోసం సమర్ధవంతమైన మరియు బలమైన పాస్వర్డ్ ఉంచడం మంచిది.

APP ను ఇన్‌స్టాల్ చేయడానికి APK ఫైల్ ఉపయోగించడం

గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో లేని ఎన్నో యాప్స్ కూడా వెలుపల ఉన్నాయి. వాటికోసం APK ఫైల్ డౌన్ లోడ్ చేసుకొని దానిద్వారా ఆ యాప్స్ ను ఇన్‌స్టాల్ చేస్తారు. కానీ, ఇది గూగుల్ ప్లే స్టోర్ ఆమోదించబడనందున ఇది ప్రమాదకరం.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :