Ambrane Force 10K పవర్ బ్యాంక్ ను విలక్షణమైన ఆఫర్ తో లాంచ్ చేసింది.!

HIGHLIGHTS

అంబ్రేన్ ఈరోజు కొత్త పవర్ బ్యాంక్ ను విలక్షణమైన ఆఫర్ తో లాంచ్ చేసింది

Ambrane Force 10K పవర్ బ్యాంక్ ను ఈరోజు లాంచ్ చేసింది

విలక్షణమైన కాంటెస్ట్ ఆఫర్ ను కూడా అందించింది

Ambrane Force 10K పవర్ బ్యాంక్ ను విలక్షణమైన ఆఫర్ తో లాంచ్ చేసింది.!

ప్రముఖ లైఫ్ స్టైల్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అంబ్రేన్ ఈరోజు ఇండియన్ మార్కెట్ లో కొత్త పవర్ బ్యాంక్ ను విలక్షణమైన ఆఫర్ తో లాంచ్ చేసింది. Ambrane Force 10K పవర్ బ్యాంక్ ను ఈరోజు కంపెనీ లాంచ్ చేసింది. ఈ పవర్ బ్యాంక్ ను తక్కువ ధరలో లాంచ్ చెయ్యడం మాత్రమే కాకుండా దీనితో విలక్షణమైన కాంటెస్ట్ ఆఫర్ ను కూడా అందించింది. గోల్డ్ లుకింగ్స్, కాంపాక్ట్ డిజైన్ మరియు మరిన్ని యాతర ఫీచర్లతో వచ్చిన ఈ కొత్త పవర్ బ్యాంక్ మరియు దీని ఆఫర్ ఎలా ఉన్నదో ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Ambrane Force 10K పవర్ బ్యాంక్

అంబ్రేన్ ఫోర్స్ 10000 పవర్ బ్యాంక్ ను కేవలం రూ. 1,299 రూపాయల ధరలో విడుదల చేసింది. ఈ పవర్ బ్యాంక్ ఈరోజు నుండి అమేజాన్ ఇండియా మరియు అంబ్రేన్ అధికారిక వెబ్సైట్ ambraneindia.com నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త పవర్ బ్యాంక్ పైన విలక్షణమైన ఆఫర్ ను కూడా కంపెనీ లాంచ్ రోజు అనౌన్స్ చేసింది.

అంబ్రేన్ ఫోర్స్ 10000 పవర్ బ్యాంక్ ని కంపెనీ అధికారిక వెబ్సైట్ నుండి కొనుగోలు చేసే యూజర్లకు 5-నైట్స్ మరియు 6-డే కాశ్మిర్ ట్రిప్ ను ఉచితంగా అందుకునే అవకాశం అందిస్తుంది. ఈ కొత్త పవర్ బ్యాంక్ ను కంపెనీ అధికారిక వెబ్సైట్ నుండి కొనుగోలు చేసే యూజర్లకు మాత్రమే ఈ ఈ కాంటెస్ట్ లో అవకాశం ఉంటుందని, కంపెనీ నొక్కి చెబుతోంది.

Also Read : Google Maps లో అద్భుతమైన ఫీచర్ లను జత చేసిన గూగుల్.!

అంబ్రేన్ ఫోర్స్ 10000 పవర్ బ్యాంక్ ప్రత్యేకతలు

Ambrane Force 10K power bank features
అంబ్రేన్ ఫోర్స్ 10000 పవర్ బ్యాంక్

అంబ్రేన్ ఫోర్స్ 10000 పవర్ బ్యాంక్ ను కంపెనీ 6 నెలల (180 days) వారెంటీతో అందిస్తోంది. ఈ పవర్ బ్యాంక్ VOOC, WARP మరియు DASH protocol- సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్ లకు అనువైనది. ఈ పవర్ బ్యాంక్ డ్యూయల్ అవుట్ ఫుట్ ఫంక్షనాలిటీతో వస్తుంది. ఇందులో Type-C మరియు USB-A port లను కలిగి వుంది.

ఈ పవర్ బ్యాంక్ 22.5W Max Boosted Speed ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ పవర్ బ్యాంక్ పటిష్టమైన మరియు కాంపాక్ట్ డిజైన్ తో అందించబడింది. ఈ పవర్ బ్యాంక్ 20W ఫాస్ట్ ఇన్ ఫుట్ ఛార్జ్ సపోర్ట్ తో త్వరగా కూడా ఛార్జ్ అవుతుంది. అంతేకాదు, ఇందులో రక్షణ కోసం మల్టి లేయర్ చిప్ సెట్ ప్రొటెక్షన్ ను కూడా అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo