Amazon Prime Day Sale 2026 announced with big deals and offers
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రత్యేకమైన మెంబర్స్ కోసం అందించే ప్రత్యేకమైన సేల్ ప్-ప్రైమ్ డే సేల్ ను ఈరోజు అనౌన్స్ చేసింది. ప్రైమ్ సభ్యుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ సేల్ నుంచి స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, స్మార్ట్ టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్ ఉత్పత్తులు మరియు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పై భారీ డిస్కౌంట్లు మరియు బిగ్ ఆఫర్స్ అందించనున్నట్లు అమెజాన్ టీజర్ మొదలు పెట్టింది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 బిగ్ సేల్ జూలై 4 ప్రారంభం అవుతుంది మరియు జూన్ 6వ తేదీ అర్ధరాత్రి తో ముగుస్తుంది. ఈ సేల్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన టీజర్ పేజీ అందించింది. ఈ టీజర్ పేజీ నుంచి అప్ కమింగ్ డీల్స్ మరియు ఆఫర్స్ గురించి వివరాలు అందించింది.
ఈ సేల్ కోసం SBI మరియు Axis బ్యాంక్ లను సేల్ బ్యాంక్ పార్ట్నర్ గా జత చేసింది. ఈ సేల్ నుంచి ఈ రెండు బ్యాంక్ కార్డ్స్ తో ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. అదనంగా, ఈ సేల్ నుంచి 3 మంత్ అమెజాన్ పే లేటర్ ఆఫర్, అమెజాన్ పే UPI పై 5% బ్యాక్ ఆఫర్ మరియు అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లు అందించింది. అలాగే, EMI అప్షన్స్, నో కాస్ట్ EMI, ఎక్స్చేంజ్ ఆఫర్లు మరియు క్యాష్ బ్యాక్ ప్రయోజనాలు కూడా ఈ సేల్ నుంచి అందుబాటులో ఉంటాయి.
కొత్త 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఈ సేల్ మంచి అవకాశం. ఎందుకంటే, ఫ్లాగ్ షిప్ మరియు మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ల పై భారీ ధర తగ్గింపు అందించబోతున్నట్లు అమెజాన్ టీజింగ్ చేస్తోంది. అదనంగా, పాత ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా మరింత తగ్గింపు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ సేల్ నుంచి ఐఫోన్, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా, వన్ ప్లస్ 13 మరియు ఐకూ 15R వంటి ప్రీమియం ఫోన్స్ పై బెస్ట్ డీల్స్ అందుకోవచ్చని అమెజాన్ టీజర్ పేజీలో తెలిపింది.
ఈ సేల్ నుంచి ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు మరియు కిచెన్ అప్లయెన్సెస్‌పై కూడా ప్రత్యేక డీల్స్ అందుబాటులో ఉంటాయి. కొత్త ఇంటిని కోసం లేదా పాత ఉపకరణాలను అప్ గ్రేడ్ చేయాలనుకునే వారికి ఈ సేల్ ఇది మంచి సమయం అవుతుంది.
Also Read: Tecno Pova 8 5G: భారీ ఆఫర్స్ తో మొదలైన 8000 mAh బిగ్ బ్యాటరీ ఫోన్ సేల్.!
ఇంటి కోసం తీసుకునే ముఖ్యమైన ఉపకరణాలలో స్మార్ట్ టీవీ అండ్ సౌండ్ బార్ ముందు వరుసలో ఉంటాయి. గతంలో అమెజాన్ నిర్వహించిన సేల్ నుంచి అందించిన ఆఫర్స్ ద్వారా 2026 సేల్ నుంచి కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ మరియు డీల్స్ లభిస్తాయని మనం అంచనా వేయవచ్చు.